టెక్ దిగ్గజం గూగుల్(Google).. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పటికే ఉన్నవాటిని మరింత స్మార్ట్‌గా వినియోగించుకునేలా అప్‌డేట్స్ కూడా అందిస్తుంటుంది. కస్లమర్లు పోగొట్టుకునే, దొంగతనానికి గురైన స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించే ఫైండ్ మై డివైజ్ (Find My Device) ఫీచర్ ఎంతో పాపులర్ అయింది. అయితే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లను ఆన్‌లైన్ మోడ్‌లో ఉంచుకున్నప్పుడే ఈ సర్వీస్ వినియోగించుకోవచ్చు. ఇప్పుడు యూజర్లు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ వారి Android లేదా WearOS డివైజ్‌లను ట్రాక్ చేసేలా ఫీచర్‌ను గూగుల్ అప్‌డేట్ (Update) చేయనుంది.
Sammobile రిపోర్ట్ ప్రకారం.. Google సిస్టమ్ అప్‌డేట్ కోసం చేంజ్‌లాగ్‌లో ఈ ఫీచర్ వివరాలను మొదటగా ప్రస్తావించారు. న్యూ ప్రైవసీ-సెంట్రిక్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగిస్తూ, ఎన్‌స్క్రిప్టెడ్ లాస్ట్-నోన్ లొకేషన్ రిపోర్ట్ ఆధారంగా ఆండ్రాయిడ్ డివైజెస్ కోసం ఫైండ్ మై డివైజ్ ఫీచర్ ఇప్పుడు సపోర్ట్ చేయనుందని చేంజ్‌లాగ్‌లో పేర్కొన్నారు.
త్వరలో అప్‌గ్రేడ్
Android, Wear OS డివైజ్‌లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వడానికి, పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైనన డివైజ్‌లను సులభంగా గుర్తించడానికి ఈ ఫీచర్ అప్‌గ్రేడ్ కానుంది. Samsung, Appleలో ఉన్న ఇప్లిమెంటేషన్ - డివైజ్ లొకేటింగ్ సర్వీస్ మాదిరిగా ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. దీంతో మీ డివైజ్ లొకేషన్‌ను మీరు తప్ప మరెవరూ చూడలేరు.
రిపోర్ట్ ప్రకారం శామ్‌సంగ్ అందించే SmartThings Find ఫీచర్‌తో Galaxy డివైజ్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా దాని లొకేషన్‌ను గుర్తించవచ్చు. బ్లూటూత్ ద్వారా సదరు స్మార్ట్‌ఫోన్‌ను సమీపంలోని శామ్‌సంగ్ డివైజ్‌లకు కనెక్ట్ చేసి వినియోగదారులకు లొకేషన్‌ను రిపోర్ట్ చేయవచ్చు. అలా దాని లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. ఇది యాపిల్ సిస్టమ్ అంత పవర్‌ఫుల్ కానప్పటికీ, ఇప్పటికే 200 మిలియన్ యూజర్లు తమ డివైజ్‌లను గుర్తించగలిగారు. యాపిల్ Find My యాప్ ద్వారా డివైజ్ చేస్తుంది. ఇది శామ్‌సంగ్ అందించే ఫీచర్ కంటే శక్తిమంతమైనది, సురక్షితమైనది.
ప్రస్తుత వెర్షన్‌కు ఆన్‌లైన్ కనెక్ట్ తప్పనిసరి..
Find My Device సర్వీస్ ప్రస్తుత వెర్షన్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన Android, Wear OS డివైజ్‌లను ట్రాక్ చేయడానికి యూజర్లకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఉపయోగించి యూజర్లు తమ డివైజ్ నుంచి Google ఖాతాను రిమోట్‌గా లాక్ చేయడం, సైన్ అవుట్, తొలగించడం చేయవచ్చు. అయితే డివైజ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. నెట్‌కు కనెక్ట్ కాకపోతే ఫైండ్ మై డివైజ్ ఉపయోగించి డివైజ్‌ను ట్రాక్ చేయలేం. అంతేకాకుండా డివైజ్‌ను రీసెట్ చేయడం ద్వారా సెట్టింగ్‌ను డిజేబుల్ చేయవచ్చు. ఈ సందర్భంలో కూడా డివైజ్‌ను ట్రాక్ చేయడం కుదరదు. ఈ ప్రతికూలతలను తొలగించడానికి గూగుల్ Find My Device ఫీచర్‌ను త్వరలో అప్‌గ్రేడ్ చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.