Home /News /technology /

GOOGLE GOOD NEWS FOR STARTUP COMPANIES TRAINING ON SPECIAL COURSES FOR NINE WEEKS THESE ARE THE COURSES UMG GH

Start-Up School: స్టార్టప్‌ కంపెనీలకు గూగుల్ గుడ్ న్యూస్..! తొమ్మిది వారాల పాటు ప్రత్యేక కోర్సులపై శిక్షణ..? ఆ కోర్సులు ఇవే !

స్టార్టప్‌ కంపెనీలకు గూగుల్ తొమ్మిది వారాల పాటు  ప్రత్యేక కోర్సులపై శిక్షణ

స్టార్టప్‌ కంపెనీలకు గూగుల్ తొమ్మిది వారాల పాటు ప్రత్యేక కోర్సులపై శిక్షణ

ఇండియాలో స్టార్టప్‌ల(Start-Up)కు మార్గనిర్దేశం చేసేందుకు గూగుల్‌ ఇండియా(Google India) కంపెనీ ముందుకు వచ్చింది. టైర్ 2, టైర్‌ 3 నగరాల్లో 10,000 స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేసేందుకు స్టార్టప్ స్కూల్‌ను ప్రారంభించినట్లు గూగుల్ ఇండియా బుధవారం ప్రకటించింది.

ఇంకా చదవండి ...
ఇండియాలో స్టార్టప్‌ల(Start-Up)కు మార్గనిర్దేశం చేసేందుకు గూగుల్‌ ఇండియా(Google India) కంపెనీ ముందుకు వచ్చింది. టైర్ 2, టైర్‌ 3 నగరాల్లో 10,000 స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేసేందుకు స్టార్టప్ స్కూల్‌ను ప్రారంభించినట్లు గూగుల్ ఇండియా బుధవారం ప్రకటించింది.
స్టార్టప్ స్కూల్ అనేది మార్గనిర్దేశం చేసేందుకు అవసరమైన ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ సెషన్‌లతో ఉంటుంది.  వీటిని ఎదుగుతున్న కంపెనీలకు అవసరమైన టూల్స్‌, ప్రొడక్టులు, నాలెడ్జ్‌ అందించేందుకు, స్టార్టప్ వ్యవస్థాపకులను సన్నద్ధం చేయడానికి రూపొందించారు.  స్టార్టప్‌లకు అవసరమైన అన్ని రకాల అంశాలను కోర్సు కరికులమ్‌లో పొందుపరిచారు.  ప్రభావవంతమైన ప్రొడక్ట్‌ స్ట్రాటజీని రూపొందించడం, ప్రొడక్ట్‌ యూజర్‌ వ్యాల్యూపై లోతైన అవగాహన, రోడ్-మ్యాపింగ్, ప్రొడక్ట్‌ రిక్వైర్‌మెంట్స్‌ డాక్యుమెంట్‌ డెవలప్‌మెంట్‌, భారతదేశం వంటి మార్కెట్‌లలో తదుపరి బిలియన్ వినియోగదారుల కోసం యాప్‌లను రూపొందించడం, యూజర్‌ అక్విజిషన్‌
వంటి మరెన్నో సబ్‌జెక్టులపై ఇన్‌స్ట్రక్షనల్‌ మాడ్యూల్స్ ఉంటాయి.

ఇదీ చదవండి : Russia-Ukraine War: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..? ఇవిగో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?


తొమ్మది వారాల కోర్స్‌
తొమ్మిది వారాల ప్రోగ్రామ్‌లో ఫిన్‌టెక్, D2C, B2B, B2C ఇ-కామర్స్, లాంగ్వేజ్‌, సోషల్ మీడియా, నెట్‌వర్కింగ్ , జాబ్ సెర్చ్‌లో విస్తరించి ఉన్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోని గూగుల్‌ లీడర్స్‌, ట్రైల్‌బ్లేజింగ్ సహకారుల మధ్య ఫైర్‌సైడ్ చాట్‌లు కూడా ఉంటాయి.
ఈ కోర్సు గురించి డెవలపర్ రిలేషన్స్ ప్రోగ్రామ్ మేనేజర్ కార్తీక్ పద్మనాభన్, డైరెక్టర్ - ప్లే పార్టనర్‌షిప్స్ ఆదిత్య స్వామి ఒక బ్లాగ్‌పోస్ట్‌లో రాశారు. సమర్థవంతమైన ఫౌండర్‌గా మారడానికి వివిధ చర్చల నుంచి ఆర్తోగనల్‌ ఇన్‌సైట్స్‌ తీసుకునే అవకాశం, హైరింగ్‌ను ఫార్మలైజ్‌ చేయడం తెలుసుకే అవకాశం ఉంటాయని పేర్కొన్నారు.

మూడో స్థానంలో ఇండియా
దాదాపు 70,000 స్టార్టప్‌లతో, భారతదేశం ప్రపంచంలోనే స్టార్టప్‌లు ఎక్కువగా ఉన్న జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఎక్కువ మంది ఇండియన్‌ ఫౌండర్‌లు తమ కంపెనీలను విజయవంతంగా IPOలు లేదా యునికార్న్ హోదాకు నడిపిస్తున్నారు. వారి విజయం దేశంలోని యువతపై ఆధారపడి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న యువత నైపుణ్యాలు స్టార్టప్‌లను మార్కెట్‌లో పెద్ద కంపెనీలుగా నిలపడానికి దోహదపడుతున్నాయి.
స్టార్టప్‌లు ఇకపై బెంగళూరు, ఢిల్లీ, ముంబై లేదా హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కావు. భారతదేశంలో జైపూర్, ఇండోర్, గోరఖ్‌పూర్ వంటి మరిన్ని కేంద్రాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక స్టార్టప్‌లు ఉన్నాయి.ఐదేళ్లలోనే మూతబడిన 90 శాతం స్టార్టప్‌లు
దేశంలో గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో దాదాపు 50 శాతం ఉన్నాయి. దాదాపు 90 శాతం స్టార్టప్‌లు వారి ప్రయాణంలో మొదటి ఐదేళ్లలో విఫలమయ్యాయి. ఎక్కువగా ఒకే రకమైన కారణాలతో వెనకబడ్డాయి. అందులో.. డబ్బు నిర్వహణ లేమి, డిమాండ్‌ అంచనా లోపం, అసమర్థమైన ఫీడ్‌బ్యాక్‌ లూప్‌లు, నాయకత్వ లక్షణం లేకపోవడం వంటివి ఉన్నాయని బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ జ్ఞానాన్ని నిర్మాణాత్మక పాఠ్యాంశంగా మార్చి ఎక్కువ మందికి అందించే ప్రోగ్రామ్‌ల అవసరం ఉందని, స్టార్టప్ స్కూల్ ఇండియా పేరిట గూగుల్ తీసుకుంటున్న చొరవకు సపోర్ట్‌ చేయడానికి తమ వంతు కృషి చేస్తామని బ్లాగ్‌పోస్ట్‌లో రాశారు.
Published by:Mahesh
First published:

Tags: Google, It companies, Start-Up, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు