GOOGLE FITS ABILITY TO MEASURE HEART AND RESPIRATORY RATES USING YOUR PHONE CAMERAS IS NOW AVAILABLE FOR IOS GH VB
Google Fit: ఐఓఎస్ డివైజ్‌లలోనూ గూగుల్ ఫిట్ ఫీచర్.. మీ హార్ట్ రేట్‌ను ఇలా చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
గూగుల్ 2021 ఫిబ్రవరిలో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ఫిట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ను మొదట పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది. క్రమంగా ఇతర గూగుల్ డివైజ్‌లకు సైతం తీసుకొచ్చింది.
కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరిలోనూ శ్రద్ధ పెరిగింది. ఎప్పటికప్పుడు మన గుండె, శ్వాసకోశ రేటును మానిటర్ చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో హెల్త్ మానిటరింగ్ డివైజెస్‌కు గణనీయమైన ఆదరణ పెరిగింది. దీంతో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ డివైజ్‌లో హృదయ స్పందన రేటుతో (హార్ట్ రేట్) పాటు శ్వాసకోశ రేటును (రెస్పిరేటరీ రేట్) ట్రాక్ చేసే ఫీచర్‌ను విడుదల చేసింది.
గూగుల్ ఫిట్ ఫీచర్‌తో డివైజ్‌లోని కెమెరా సెన్సార్లను ఉపయోగించి హెల్త్ మానిటర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు ఐఓఎస్ డివైజెస్‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఐఓఎస్‌లో రన్ అయ్యే డివైజెస్‌తో కూడా ఇప్పుడు హార్ట్, రెస్పిరేటరీ రేటును చెక్ చేసుకోవచ్చు.
తాజా నివేదికల ప్రకారం, గూగుల్ ఫిట్ హోమ్ ఫీడ్‌లో “Check your heart rate”, “Track your respiratory rate” అనే రెండు ఆప్షన్లను కొత్తగా జోడించింది. స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా ఈ ఫీచర్ పని చేస్తుంది. వినియోగదారులు వారి డివైజ్ వెనుక కెమెరా సెన్సార్‌పై తమ బ్రొటన వేలు పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే.. హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు. కేవలం 30 సెకన్లలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మీ ఫలితాలు డిస్ప్లే దిగువన పీబీఎం ప్రివ్యూ గ్రాఫ్ రూపంలో చూసుకోవచ్చు.
ఈ టెస్టింగ్ పూర్తయిన తర్వాత గూగుల్ ఫిట్‌లో మీ హెల్త్ మానిటరింగ్ హిస్టరీని సేవ్ చేయాలా వద్దా అనేది కూడా ఎంచుకోవచ్చు. మరోవైపు, మీ ముందు కెమెరాతో మీరు ఒక నిమిషంలో తీసుకునే శ్వాసల సంఖ్యను కూడా ట్రాక్ చేయవచ్చు. అయితే, మీరు ఫోటో తీసుకునే సమయంలో మీ తల, ఎగువ మొండెం కదపకుండా స్పష్టంగా తీయండి. అప్పుడే కచ్చితత్వంతో కూడిన ఫలితం వస్తుంది.
గతంలో ఆండ్రాయిడ్ యూజ్లకు మాత్రమే..
గూగుల్ 2021 ఫిబ్రవరిలో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ఫిట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ను మొదట పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది. క్రమంగా ఇతర గూగుల్ డివైజ్‌లకు సైతం తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ 7, ఐపాడ్ ప్రో రెండింటికీ పని చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, దీని ద్వారా వచ్చే ఫలితాలు వైద్య ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి కావు.
ఏదైనా వ్యాధి లేదా వైద్య పరిస్థితిని నిర్ధారించడానికి, నయం చేయడానికి, చికిత్స చేయడానికి లేదా నిరోధించడానికి ఉపయోగించకూడదని కంపెనీ వినియోగదారులను హెచ్చరించింది. కేవలం, మీ హార్ట్, రెస్పిరేటరీ రేటును అంచనా వేసేందుకే ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని గుర్తు చేసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.