Work From Home: ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 2021 జూన్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

Covid 19 | ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఉద్యోగులు ఇంకొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన పరిస్థితి తప్పేలా లేదు.

news18-telugu
Updated: July 28, 2020, 9:26 AM IST
Work From Home: ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 2021 జూన్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్
Work From Home: ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 2021 జూన్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గూగుల్ ఉద్యోగులకు శుభవార్త. 2021 జూన్ 30 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేందుకు తమ ఉద్యోగులకు అనుమతి ఇచ్చింది గూగుల్. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలిపారు. "ఉద్యోగులు భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి వీలుగా, 2021 జూన్ 30 వరకు స్వచ్ఛందంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. వాళ్లు తమ విధులు నిర్వహించడానికి ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మెయిల్ పంపారు.

Redmi 9: రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఈ సర్వీస్ ఉచితం

గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలున్నాయి. భారతదేశంలో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఆఫీసులు ఉన్నాయి. ప్రస్తుతం గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా 2,00,000 మంది గూగుల్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు 2021 జూన్ 30 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. గతంలో ఉద్యోగులకు 2021 జనవరి వరకు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది గూగుల్. కానీ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇతర టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు కొన్ని నెలల్లో తమ ఆఫీసుల్ని రీఓపెన్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

EPF Claim: ఈపీఎఫ్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోలేదా? మీ డబ్బులు ఏమవుతాయంటే

Realme 6i: రియల్‌మీ 6ఐ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా?

వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు 41 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 63,968 కేసులు నమోదయ్యాయి. ఇక భారతదేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 14,35,453 కాగా, 4,85,114 యాక్టీవ్ కేసులున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: July 28, 2020, 9:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading