Google Drive: గూగుల్ డ్రైవ్ భారీ సెక్యూరిటీ అప్‌డేట్‌... ఎప్పుడు విడుదల అవుతుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌ గూగుల్‌ డ్రైవ్‌ కోసం ఓ సరికొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అప్‌డేట్‌ సెప్టెంబర్ 13న విడుదల కానుంది. 

  • Share this:
సెర్చ్‌ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ వినియోగదారులకు కట్టుదిట్టమైన భద్రత అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ యూజర్ల డేటాను పదిలంగా ఉంచుతుంది. అయితే ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌ గూగుల్‌ డ్రైవ్‌ కోసం ఓ సరికొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అప్‌డేట్‌ సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఫైల్ షేరింగ్‌ను మరింత సురక్షితంగా మార్చడమే ఈ అప్‌డేట్‌ ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. త్వరలోనే మీరు ఈ అప్‌డేట్‌ గురించి నోటిఫికేషన్స్ పొందే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త అప్‌డేట్‌ డ్రైవ్ లో ఉన్న మీ ఫైల్స్ పై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ విషయం గురించి గూగుల్ ముందుగానే హెచ్చరిస్తోంది. కొన్ని డ్రైవ్ ఫైల్స్ కి సంబంధించిన లింక్స్ మారిపోతాయని గూగుల్ తెలుపుతోంది. ఉదాహరణకి మీరు ఒక డ్రైవ్ లింక్ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు షేర్ చేస్తే.. అప్‌డేట్‌ తర్వాత ఆ లింక్ పనిచేయకపోవచ్చు. అలాగే, కొత్త ఫైల్స్ యాక్సెస్ చేయడానికి హోస్ట్ పర్మిషన్ అడగొచ్చు. ఒకవేళ ఇప్పటికే ఫైల్స్ యాక్సెస్ చేసి ఉంటే వారి హోస్ట్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
TRAI: మరింత పెరిగిన Jio హవా.. కొత్తగా 35.54 లక్షల కస్టమర్లు.. Airtel నుంచి 46.13 లక్షల మంది ఔట్

ఈ సెక్యూరిటీ అప్‌డేట్‌ తరువాత డ్రైవ్ లోని ఫలానా ఫైల్స్ పై ప్రభావం పడుతుందని గూగుల్ ముందుగానే తెలిపింది. ఈ సమాచారం తెలుసుకోవడం కోసం మీరు వెబ్ బ్రౌజర్ లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయండి. పైభాగంలోనున్న బ్యానర్ లో "See Files" పై క్లిక్ చేయండి. అప్పుడు మీరు అప్‌డేట్‌ తరువాత ఎటువంటి ఫైల్స్ పై ప్రభావం పడుతుందో చూడొచ్చు. ఆ అన్ని ఫైల్స్ ని మీరు ఇప్పటికే వీక్షించినట్లయితే.. కొత్తగా యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇతర యూజర్లు మాత్రం యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ లను అవాయిడ్ చేసేందుకు హోస్ట్ ప్రత్యేకమైన ఫైల్స్ నుంచి అప్‌డేట్‌ తొలగించొచ్చు. కానీ ఫైల్స్ పబ్లిక్ లో పోస్ట్ చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కొత్త అప్‌డేట్‌ ఆండ్రాయిడ్, యాపిల్, వెబ్ వెర్షన్ లకు వర్తిస్తుంది.

డ్రైవ్ లోని ఫైల్స్ లకు కొత్త సెక్యూరిటీ అప్లై చేయాలంటే మీరు చేయాల్సిన పనేమి ఉండదు. అన్ని ఫైళ్లకు అప్‌డేట్‌ అనేది డిఫాల్ట్ గా జరిగిపోతుంది. బ్యానర్ క్రింద మీరు సెక్యూరిటీ అప్‌డేట్‌ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఫైల్స్ కింద “అప్లైడ్” అని ఉండటం గమనించవచ్చు. మీరు అప్‌డేట్‌ తీసివేయాలనుకుంటే, మౌస్ కర్సర్‌ను యూస్ చేసి ప్రతి ఫైల్‌ నుంచి తొలగించవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: