దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ (Google) హోమ్ పేజీలో కనిపించే గూగుల్ డూడుల్ (Google Doodle)కి చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా వారి గౌరవార్థం స్పెషల్ డూడుల్స్ గూగుల్ ఎప్పుడూ ఆవిష్కరిస్తూనే ఉంటుంది. అంతేకాదు ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేసేలా, కొత్త విషయాలను నేర్చుకునేలా కూడా డూడుల్స్‌ను గూగుల్ పోస్ట్ చేస్తుంటుంది. ఇలాంటి డూడుల్స్ క్రియేట్ చేయడానికి డూడుల్ ఫర్ గూగుల్ పోటీ కూడా పెడుతుంటుంది. అయితే ఈ సంవత్సరం చిల్డ్రన్స్ డే(Childrens Day) సందర్భంగా ఇండియాలో నిర్వహించిన పోటీల్లో, కోల్‌కతాలోని న్యూటౌన్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన శ్లోక్ ముఖర్జీ గెలుపొందాడు. ‘ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్’ పేరుతో శ్లోక్ ముఖర్జీ క్రియేట్ చేసిన డూడుల్‌ను అత్యుత్తమ డూడుల్‌గా గూగుల్ ప్రకటించింది.
* ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్
భారతదేశంలో డూడుల్ ఫర్ గూగుల్ 2022 (Doodle for Google 2022) కంటెస్ట్ నిర్వహించగా 100 నగరాల్లోని 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు పాటిస్పేట్ చేశారు. "రాబోయే 25 సంవత్సరాలలో, నా భారతదేశం...." అనే థీమ్‌తో కండక్ట్ చేసిన ఈ పోటీల్లో 1,15,000 కంటే ఎక్కువమంది పాటిస్పేట్ చేశారు. పిల్లలు తమ అద్భుతమైన ఇమేజినేషన్, క్రియేటివిటీతో డూడుల్స్ గూగుల్‌కి పంపించారు. కాగా వాటన్నిటిలో శ్లోక్ ముఖర్జీ డూడుల్ విన్నర్‌గా నిలిచింది. ‘ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్’ పేరుతో శ్లోక్ ఆలోచనాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన డూడుల్ క్రియేట్ చేశాడు.
“రాబోయే 25 ఏళ్లలో మానవాళి అభివృద్ధికి నా భారతదేశం శాస్త్రవేత్తలు వారి సొంత ఏకో-ఫ్రెండ్లీ రోబోను అభివృద్ధి చేస్తారు. భారతదేశం భూమి నుంచి అంతరిక్షానికి క్రమం తప్పకుండా నక్షత్రమండలాల మధ్య ప్రయాణాలను చేస్తుంటుంది. భారతదేశం యోగా, ఆయుర్వేద రంగంలో మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే సంవత్సరాల్లో యోగా, ఆయుర్వేద రంగాల్లో ఇండియా మరింత బలపడుతుంది." అని శ్లోక్ తన గూగుల్ ఆర్ట్‌వర్క్‌తో పాటు రాశాడు. సైంటిఫిక్ ఫీల్డ్‌లో భారతదేశం ప్రధాన దశకు చేరుకోవాలని, సైంటిఫిక్ రంగంలో ఇండియా కేంద్ర బిందువు కావాలని శ్లోక్ తన డూడుల్‌తో సూచించడాన్ని గూగుల్ మెచ్చుకుంది. అందుకే అతడి డూడుల్‌ను విన్నర్‌గా ప్రకటించింది. అంతేకాదు శ్లోక్ డూడుల్‌ను 2022, నవంబర్ 14 నుంచి 24 గంటల పాటు Google.co.inలో డిస్ప్లే చేస్తోంది.
ఈ సంవత్సరం డూడుల్ ఫర్ గూగుల్ న్యాయనిర్ణేత ప్యానెల్లో గూగుల్ డూడుల్ టీమ్‌తో పాటు ప్రముఖ యాక్టర్ నీనా గుప్తా, టింకిల్ కామిక్స్‌లో ఎడిటర్-ఇన్-చీఫ్ అయిన అలికా భట్ ఉన్నారు. వీరు ఆర్టిస్టిక్ మెరిట్, క్రియేటివిటీ, కాంటెస్ట్ థీమ్‌కి డూడుల్ అనుగుణంగా ఉందా లేదా వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని దేశం నలుమూలల నుంచి 20 మందిని ఫైనల్ చేశారు. ఈ 20 ఫైనలిస్ట్ డూడుల్స్‌ను పబ్లిక్ ఓటింగ్ కోసం ఆన్లైన్లో ఉంచారు. ఈ వోటింగ్‌లో శ్లోక్ డూడుల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ పోటీలో నేషనల్ విన్నర్‌గా నిలిచిన వారికి రూ. 5,00,000 కాలేజ్ స్కాలర్షిప్, రూ.2,00,000 టెక్నాలజీ ప్యాకేజీని అందిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది.
నేషనల్ విన్నర్‌తో పాటు, 4 గ్రూప్ విజేతలను కూడా గూగుల్ ప్రకటించింది. గ్రూప్ 1-2 సెక్షన్లో కనకాల శ్రీనిక, శ్రీ ప్రకాష్ విద్యానికేతన్, విశాఖపట్నం విజేతగా నిలవగా... గ్రూప్ 5-6 విభాగంలో జరిగిన పోటీలో గుర్గావ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన దివ్యాన్షి సింఘాల్ గెలుపొందారు. గ్రూప్ 7-8 విభాగంలో పిహు కచ్చప్, ఎస్జిబిఎం స్కూల్, రాంచీ గెలుపొందగా, గ్రూప్ 9-10తో విశాఖపట్నంలోని పుప్పాల ఇందిరా జాహ్నవి, శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ గెలుపొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Google, Google Doodle