HOME »NEWS »TECHNOLOGY »google doodle celebrates 20th birthday of the search engine

హ్యాపీ బర్త్ డే గూగుల్!

హ్యాపీ బర్త్ డే గూగుల్!
Image: Google Doodle

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చింజిన్ అయిన గూగుల్ 20వ పుట్టిన రోజు ఈ రోజు. సెప్టెంబర్ 27న గూగుల్ 20 ఏళ్లు పూర్తిచేసుకోవడం విశేషం.

  • Share this:
    గూగుల్... ఈ సంస్థ గురించి తెలియనివారుండరు. ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నావాళ్లైనా గూగుల్ ఉపయోగించాల్సిందే. ఇలా అందరి జీవితంలో భాగమైపోయింది గూగుల్. ఏ అనుమానం వచ్చినా, ఏ సందేహం వచ్చినా, ఏ అవసరమొచ్చినా అందరికీ ముందుగా గుర్తొచ్చేది గూగులే.

    ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చింజిన్ అయిన గూగుల్ 20వ పుట్టిన రోజు ఈ రోజు. సెప్టెంబర్ 27న గూగుల్ 20 ఏళ్లు పూర్తిచేసుకోవడం విశేషం. వాస్తవానికి గూగుల్ సెప్టెంబర్ మాసం మొత్తం బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోంది. "మరో 20 ఏళ్లు" ఎలా ముందుకెళ్లాలో ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే అధికారికంగా సెప్టెంబర్ 27న పుట్టినరోజు కాబట్టి గూగుల్ తన మార్క్ డూడుల్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఆ డూడుల్ వీడియోలో గూగుల్ చరిత్రంతా కనిపిస్తుంది. ఈ ఇరవై ఏళ్లల్లో జనం ఏమేం సెర్చ్ చేశారో ఆ వీడియోలో ఉంటుంది.



    స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థులైన లారీ పేజ్, సెర్గీ బ్రిన్ 1998లో గూగుల్‌ని ఆవిష్కరించారు. 2016లో గూగుల్ కంపెనీ ఆల్ఫబెట్‌లో భాగమైంది. అందులో పేజ్, బ్రిన్ బోర్డ్ మెంబర్స్‌గా ఉన్నారు. 2005 నుంచి ఎందరో ప్రముఖుల బర్త్‌డేలను డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేయడం గూగుల్‌కు అలవాటు. ఇప్పుడు తన 20వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా ప్రత్యేకమైన డూడుల్‌ రూపొందించడం విశేషం.

    ఇవి కూడా చదవండి:

    మీ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ ఉందా? ఈ న్యూస్ మీకోసమే!

    గూగుల్ అసిస్టెంట్‌లో మరింత లోతుగా గూగుల్ న్యూస్!

    గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!

    లొకేషన్ ఆఫ్ చేసినా ట్రాక్ చేస్తామంటున్న గూగుల్!

    విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!

    గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

    మీ వాట్సప్ డేటా ఇలా బ్యాకప్ చేసుకోండి!
    Published by:Santhosh Kumar S
    First published:September 27, 2018, 11:28 IST

    टॉप स्टोरीज