హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Docs: గూగుల్ డాక్యుమెంట్స్ సరికొత్త ఫీచర్లు.. మల్టిపుల్ బ్లాక్స్‌లో టెక్స్ట్‌ను ఇలా చేసుకోవచ్చు..

Google Docs: గూగుల్ డాక్యుమెంట్స్ సరికొత్త ఫీచర్లు.. మల్టిపుల్ బ్లాక్స్‌లో టెక్స్ట్‌ను ఇలా చేసుకోవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గూగుల్ డాక్స్ కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ కొత్త ఫీచర్‌ (New Feature)ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో రెండు వేర్వేరు బ్లాక్‌లలోని టెక్స్ట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్‌ను కాపీ, ఎడిట్ లేదా డిలీట్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

ప్రముఖ వర్డ్ వ్యూయర్, డాక్యుమెంట్(Document) ఎడిటర్ గూగుల్ డాక్స్ (Google Docs) ప్రపంచ వ్యాప్తంగా సూపర్ పాపులర్(Super Popular) అయ్యింది. డాక్యుమెంట్లను క్రియేట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి, ఇతర వ్యక్తులతో కలిసి పని చేయడానికి గూగుల్ డాక్స్‌ను (Google Docs) మిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. గూగుల్ డాక్స్ గూగుల్ వర్క్‌స్పేస్ (Google Workplace) ఎకోసిస్టమ్‌లో ఒక భాగంగా ఉంటుంది. అయితే యూజర్ ఎక్స్‌పీరియన్స్ (Experience) మెరుగుపరిచేందుకు గూగుల్ డాక్స్ కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ కొత్త ఫీచర్‌ (New Feature)ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో రెండు వేర్వేరు బ్లాక్‌లలోని టెక్స్ట్‌ను(Texts) సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్‌ను కాపీ, ఎడిట్ లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ అనేక విధాలుగా యూజర్లకు ఉపయోగపడుతుందని గూగుల్ తాజాగా ఒక బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ఈ ఫీచర్‌ మే 25 నుంచి దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. 15 రోజులలోపు అందరికీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

WhatsApp: ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టిన వాట్సప్... యూజర్లకు గుడ్ న్యూస్

"గూగుల్ డాక్స్‌లో, మీరు ఇప్పుడు ఒకేసారి మల్టీపుల్ టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టీపుల్ టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసుకున్నాక వాటిని డిలీట్, కాపీ, పేస్ట్ ఒకేసారి చేయవచ్చు." అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని, కాపీలను ఎడిట్ చేసేటప్పుడు ప్లాట్‌ఫామ్‌లో ఫీచర్ ఆటోమేటిక్‌గా అందుబాటులో ఉంటుందని గూగుల్ వివరించింది. ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ వర్క్‌స్పేస్ కస్టమర్లు, లెగసీ G Suite బేసిక్, బిజినెస్ కస్టమర్లకు గూగుల్ అందిస్తోంది.

సాధారణంగా గూగుల్ డాక్స్ ఉపయోగించేవారు చాలా బిజీ వర్క్ చేస్తుంటారు. ఒక్కోసారి డాక్యుమెంట్‌లోని టెక్స్ట్ ఫార్మాట్‌ను చాలాసార్లు చేంజ్ చేయాల్సి వస్తుంది. అంతేకాదు రెండు, మూడు పేరాగ్రాఫ్‌లు సెలెక్ట్ చేసుకొని వేరే దగ్గర పేస్ట్ చేయాల్సి వస్తుంది. హెడ్డింగ్స్ కలర్స్ కూడా చేంజ్ చేసే పని పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొత్తగా వస్తున్న మల్టీ-సెలెక్ట్ టెక్స్ట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వర్క్ అవ్వడానికి గూగుల్ క్లాసిక్ సెలెక్ట్, కంట్రోల్/కమాండ్ టూల్‌ను ఉపయోగిస్తోంది. ఇకపై వేర్వేరు పేరాగ్రాఫ్‌లలో ఉంచిన టెక్స్ట్‌లను ఫార్మాట్ చేయాలనుకున్నప్పుడు, మొదటి టెక్స్ట్/వాక్యాన్ని ఎంచుకుని, మీరు విండోస్/macOS సిస్టమ్‌లో ఉంటే వరుసగా కంట్రోల్/కమాండ్ బటన్‌ను నొక్కాలి. తర్వాత డాక్యుమెంట్ టెక్స్ట్ ను కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు.

Smartphone Offer: ఈ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,500 తగ్గింపు

ఈ ఫీచర్‌తో రెండు బ్లాక్‌ల్లోని టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసుకోవడం కంటే ఎక్కువ పనులు చేయవచ్చని గూగుల్ చెబుతోంది. టూల్‌బార్‌లోని “అప్‌డేట్ స్టైల్ టు మ్యాచ్” అనే ఆప్షన్‌ను ఉపయోగించడం ద్వారా మీరు హైలైట్ ఫాంట్ టైప్, ఫాంట్ సైజు, హెడ్డింగ్‌ల రంగు, అలాగే సబ్-హెడ్డింగ్స్ కలర్స్ మార్చవచ్చు. డాక్స్‌ను మరింత ఫీచర్-రిచ్‌గా మార్చడానికి గూగుల్ తరచుగా యాప్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో టేబుల్ టెంప్లేట్‌లు, డ్రాప్‌డౌన్ చిప్‌లను ఇంట్రడ్యూస్ చేసింది.

Published by:Veera Babu
First published:

Tags: Google, Google documents, New features

ఉత్తమ కథలు