Home /News /technology /

GOOGLE DIGITAL WELLBEING EXPERIMENTS CREATES 5 NEW APPS KNOW ABOUT UNLOCK CLOCK POST BOX WE FLIP DESERT ISLAND MORPH APPS SS

Google Apps: గూగుల్ నుంచి 5 కొత్త యాప్స్... ప్రత్యేకతలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google Apps | డిజిటల్ వెల్‌బీయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని 5 కొత్త యాప్స్ రూపొందించింది గూగుల్. ఆ యాప్స్ మీ స్క్రీన్ టైమ్‌ని తగ్గించేవే.

    డిజిటల్ వెల్‌బీయింగ్... ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అవసరం మాత్రమే కాదు... అంతకు మించి అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. విపరీతంగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తూ ఓ వ్యసనంగా మార్చేసుకుంటున్నవాళ్లున్నారు. ఫోన్‌లో పదుల సంఖ్యలో యాప్స్ ఇన్‌స్టాల్ చేసి, గంటలు గంటలు వాటితో గడుపుతూ సమయాన్ని వృథా చేసుకోవడమే కాదు... ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. అందుకే యూజర్ల శ్రేయస్సు కోసం డిజిటల్ వెల్‌బీయింగ్‌పై దృష్టిపెట్టింది గూగుల్. ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో డిజిటల్ వెల్‌బీయింగ్‌ ఫీచర్‌ని పరిచయం చేసింది. దీని ద్వారా మీరు ఏ యాప్ ఎంతసేపు వాడుతున్నారు? టైమ్ లిమిట్ ఎలా సెట్ చేసుకోవాలి? అన్న ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ వెల్‌బీయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని 5 కొత్త యాప్స్ రూపొందించింది గూగుల్. ఆ యాప్స్ మీ స్క్రీన్ టైమ్‌ని తగ్గించేవే. మరి ఆ యాప్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.


    Unlock Clock: డిజిటల్ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా అన్‌లాక్ క్లాక్ యాప్ రూపొందించింది గూగుల్. మీరు ఒక రోజులో ఎన్నిసార్లు ఫోన్‌ను అన్‌లాక్ చేశారో లెక్కించి చూపిస్తుంది ఈ యాప్. ఇందుకోసం మీరు వాల్‌పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించడమే. అన్‌లాక్ క్లాక్ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

    Post Box: బిజీ పనుల్లో ఉన్నప్పుటు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్స్ చికాకుపుట్టిస్తుంటాయి. ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఇలాంటి సమస్యకు పోస్ట్ బాక్స్ యాప్‌తో చెక్ పెడుతోంది గూగుల్. మీర ఏ సమయాల్లో నోటిఫికేషన్స్ పొందాలో సెలెక్ట్ చేయొచ్చు. పోస్ట్ బాక్స్ యాప్ ద్వారా ఆ నోటిఫికేషన్లన్నీ మేనేజ్ చేయొచ్చు. పోస్ట్ బాక్స్ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

    We Flip: స్నేహితులంతా కలిసి ఎక్కడికైనా వెళ్తే అందరూ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించకుండా సమయాన్ని గడిపేందుకు ఉపయోగపడే యాప్ 'వి ఫ్లిప్'. ఈ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ లాక్ చేయాలి. గ్రూప్‌లో ఏ ఒక్కరు ఫోన్ అన్‌లాక్ చేసినా తెలిసిపోతుంది.'వి ఫ్లిప్' యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

    Desert Island: ఎక్కడికైనా టూర్ వెళ్లినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోకుండా అవసరమైన యాప్స్ మాత్రమే ఉపయోగించడానికి డిసర్ట్ ఐల్యాండ్ యాప్ ఉపయోగపడుతుంది. ఆ రోజు మీరు ఏ యాప్స్ అవసరమో వాటిని సెలెక్ట్ చేసుకొని అవి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. మిగతా యాప్స్ కనిపించవు. డిసర్ట్ ఐల్యాండ్ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

    Morph: ఏ యాప్‌ను ఎంత సేపు ఉపయోగించాలో మీరే సమయాన్ని కేటాయించడానికి ఉపయోగపడుతుంది మార్ఫ్ యాప్. మీరున్న స్థలం, సమయాన్ని బట్టి ఆ యాప్స్ పనిచేస్తాయి. ఉదాహరణకు ఇంట్లో ఉన్నప్పుడు ఉపయోగించే యాప్స్, ఆఫీసులో వాడే యాప్స్ ఇలా వేర్వేరుగా డివైడ్ చేయొచ్చు. మార్ఫ్ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.


    ఇవే కాదు... ఇలాంటి యాప్స్ మరిన్ని తయారు చేసేందుకు డిజిటల్ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ చేపట్టింది గూగుల్.

    Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Diwali Gift: దీపావళికి గిఫ్ట్ తీసుకుంటున్నారా? మీరు కట్టాల్సిన ట్యాక్సులు ఇవే...

    WhatsApp: వాట్సప్ గ్రూప్స్‌ మీకు సమస్యగా మారాయా? ఈ ఫీచర్ ట్రై చేయండి

    LIC: మీ ఎల్ఐసీ పాలసీకి బోనస్ వచ్చిందా? ఎస్ఎంఎస్‌తో తెలుసుకోవచ్చు
    First published:

    Tags: Google, Google Assistant, Mobile App, Smartphone

    తదుపరి వార్తలు