అన్‌ప్రొఫెషనల్... మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ఆరోపణలపై గూగుల్ రియాక్షన్

విండోస్ 10, విండోస్ 10 మొబైల్, ఎక్స్‌బాక్స్ వన్ డివైజుల్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్ అయిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ ఇన్‌స్టాల్ చేసింది ఆ కంపెనీ. అందులో యూట్యూబ్ వీడియోల స్ట్రీమింగ్‌ వేగాన్ని తగ్గించే కోడ్ ఉందన్నది మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ఆరోపణ.

news18-telugu
Updated: December 20, 2018, 6:57 PM IST
అన్‌ప్రొఫెషనల్... మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ఆరోపణలపై గూగుల్ రియాక్షన్
అన్‌ప్రొఫెషనల్... మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ఆరోపణలపై గూగుల్ రియాక్షన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌కు విఘాతం కలిగించేలా యూట్యూబ్‌ కోడ్‌ని గూగుల్ మార్చిందని మైక్రోసాఫ్ట్ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జోషువా బకితా చేసిన ఆరోపణల్ని గూగుల్ ఖండించింది. కోడ్ మార్చడం ద్వారా యూట్యూబ్ వీడియోల స్ట్రీమింగ్‌ వేగం తగ్గినట్టు ఆరోపణలొచ్చాయి. విండోస్ 10, విండోస్ 10 మొబైల్, ఎక్స్‌బాక్స్ వన్ డివైజుల్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్ అయిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ ఇన్‌స్టాల్ చేసింది ఆ కంపెనీ. అందులో యూట్యూబ్ వీడియోల స్ట్రీమింగ్‌ వేగాన్ని తగ్గించే కోడ్ ఉందన్నది మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ఆరోపణ.

హ్యాకర్ న్యూస్‌లో పబ్లిష్ అయిన పోస్ట్‌లో బకితా ఇదంతా వివరించారు. కొందరు ఎడ్జ్ బ్రౌజర్ ఇంజనీర్లను గూగుల్ ఒప్పించి ఈ పని చేసిందని జోషువా బకితా ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. ఇతర బ్రౌజర్లలో ఆప్టిమైజేషన్‌ మార్చేలా ఎలాంటి కోడ్ ఉండదని, ఏదైనా బగ్ కావొచ్చని యూట్యూబ్ అధికార ప్రతినిధి స్పందించారు. అయితే ఈ ఆరోపణలు మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి చేసినవే. దీనిపై మైక్రోసాఫ్ట్ కామెంట్ చేయాల్సి ఉంది. ఫైర్‌ఫాక్స్, ఎడ్జ్‌లో ఐదు రెట్లు నెమ్మదిగా వీడియోలు ప్లే అయ్యేలా యూట్యూబ్‌ని రీడిజైన్ చేసినట్టు ఇటీవల మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ప్రోగ్రామర్ కూడా ఆరోపించడం విశేషం.

ఇవి కూడా చదవండి:

Tax Saving Ideas: పన్నులు ఆదా చేసే మార్గాలు ఇవే...ALERT: జనవరి 1 తర్వాత ఆ చెక్కులు చెల్లవు

Good News: రూ.101 ధరకే వివో స్మార్ట్‌ఫోన్

#FlashBack2018: ఈ ఏడాది రిలీజైన టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ ఇవేPUBG News: ఫోర్ట్‌‍‌నైట్‌ కన్నా పబ్‌జీ మొబైల్‌కే ప్లేయర్స్ ఎక్కువ

రూ.30,000 పెరగనున్న హుందాయ్ కార్ల ధరలు
First published: December 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>