హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: బార్డ్‌ ట్రైనింగ్‌ కోసం గూగుల్‌ చాట్‌జిపిటిని కాపీ చేసిందా? వైరల్‌ అవుతున్న నివేదికల్లో నిజమెంత?

Google: బార్డ్‌ ట్రైనింగ్‌ కోసం గూగుల్‌ చాట్‌జిపిటిని కాపీ చేసిందా? వైరల్‌ అవుతున్న నివేదికల్లో నిజమెంత?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బార్డ్ చాట్‌బాట్‌కు ట్రైనింగ్‌ ఇవ్వడానికి ChatGPTని కాపీ చేస్తున్నట్లు వచ్చిన నివేదికలను గూగుల్ ఖండించింది. ఈ అంశంపై వైరల్‌ అవుతున్న నివేదికలోని అంశాలను తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

టెక్‌ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్ కంపెనీల మధ్య ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. OpenAI, మైక్రోసాఫ్ట్‌ కంపెనీల కలయికలో లాంచ్‌ అయిన చాట్‌జిపిటి తక్కువ కాలంలోనే పాపులర్‌ అయింది. దీనికి పోటీగా గూగుల్‌ కంపెనీ బార్డ్‌ చాట్‌బాట్‌ను అనౌన్స్‌ చేసింది. ఇటీవలే లిమిటెడ్‌ యాక్సెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు బార్డ్ చాట్‌బాట్‌కు ట్రైనింగ్‌ ఇవ్వడానికి ChatGPTని కాపీ చేస్తున్నట్లు వచ్చిన నివేదికలను గూగుల్ ఖండించింది. ఈ అంశంపై వైరల్‌ అవుతున్న నివేదికలోని అంశాలను తెలుసుకుందాం.

‘ది ఇన్ఫర్మేషన్‌’ ఏజెన్సీ రిపోర్ట్.. OpenAI సక్సెస్‌, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌లోని రెండు AI రీసెర్చ్‌ టీమ్‌లు, తమ మధ్య ఉన్న కొన్ని సంవత్సరాల తీవ్రమైన పోటీని పక్కనబెట్టి, కలిసి పని చేసేలా చేసిందని పేర్కొంది. చాట్‌జిపిటిని ఎదుర్కొనేందుకు రెండు టీమ్‌లు కృషి చేస్తున్నాయని తెలిపింది. కొన్ని సోర్సెస్‌ తెలిపిన వివరాల మేరకు.. గూగుల్‌కి చెందిన బ్రెయిన్ AI గ్రూప్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, OpenAIకి పోటీగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి ఆల్ఫాబెట్‌లోని సిబ్లింగ్‌ కంపెనీ DeepMindలో ఉద్యోగులతో కలిసి పని చేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇంటెర్నల్‌గా జెమినిగా పేర్కొంటున్న, రెండు టీమ్‌ల ఉమ్మడి ప్రయత్నం ఇటీవల ప్రారంభమైందని, గూగుల్ బార్డ్‌తో చాట్‌జిపిటిని ఎదుర్కొనేందుకు వేసిన తొలగి అడుగు విఫలమైందని తెలిపింది.

మరింత మందికి బార్డ్‌ యాక్సెస్‌?

అయితే, ShareGPT లేదా ChatGPT నుంచి ఎలాంటి డేటాపై బార్డ్ శిక్షణ పొందలేని గూగుల్‌ ప్రతినిధి ‘ది వెర్జ్‌’తో చెప్పారు. ఇంతలో వినియోగదారులు జరేటివ్‌ AIతో కొలాబరేట్‌ కావడానికి ముందస్తు ప్రయోగంగా ChatGPT పోటీదారు బార్డ్‌కి యాక్సెస్‌ను ఓపెన్‌ చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. బార్డ్‌కు ముందస్తు యాక్సెస్ యూఎస్‌, యూకేలోని యూజర్‌లకు అందుబాటులోకి వచ్చింది. కాలక్రమేణా మరిన్ని దేశాలు, భాషలకు యాక్సెస్‌ విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.

OpenAI డెవలప్‌ చేసిన ChatGPT, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ చాట్‌బాట్ లాగానే బార్డ్, ఒక లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్ (LLM)పై ఆధారపడి ఉంటుంది. ఈ LaMDA లైట్‌వెయిట్‌, ఆప్టిమైజ్డ్‌ వెర్షన్‌. భవిష్యత్తులో కొత్త, మరింత సామర్థ్యం గల మోడల్‌లతో అప్‌డేట్ చేయనున్నట్లు గూగుల్‌ పేర్కొంది. వినియోగదారులు ప్రశ్నలు అడగడం ద్వారా, బార్డ్‌తో ఇంటరాక్ట్‌ అవ్వవచ్చు. ఫాలోఅప్‌ ప్రశ్నలతో ప్రతిస్పందనలను మెరుగపరచుకోవచ్చు.

OpenAIలో చేరిన గూగుల్‌ మాజీ ఇంజనీర్

గతంలో గూగుల్‌లో పనిచేసిన AI ఇంజనీర్ జాకబ్ డెవ్లిన్ OpenAIలో చేరినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ChatGPT డేటాను ఉపయోగించడంపై ఆయన గూగుల్‌ను హెచ్చరించారని, ఆ తర్వాతనే OpenAIలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. OpenAI డేటా వినియోగించడం ఆ కంపెనీ టర్మ్స్ ఆఫ్‌ సర్వీస్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని గూగుల్‌తో డెవ్లిన్‌ వాదించారని, డెవ్లిన్ హెచ్చరికలను అనుసరించి గూగుల్‌ డేటాను ఉపయోగించడం ఆపివేసినట్లు తెలిసింది. అయితే గూగుల్‌ డేటాను ఉపయోగించిందా? లేదా? అనేది అస్పష్టంగానే ఉంది. అయితే, గూగుల్‌ AI చాట్‌బాట్ టెక్నాలజీని మెరుగుపరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.

First published:

Tags: Google

ఉత్తమ కథలు