Home /News /technology /

GOOGLE COULD SOON BRING MORE PIXEL CENTRIC SAFETY FEATURES TO OTHER SMARTPHONES UMG GH

Pixel Features: అన్ని స్మార్ట్‌ఫోన్లకు పిక్సెల్ సేఫ్టీ ఫీచర్లను రిలీజ్ చేయనున్న గూగుల్.. ఆ వివరాలివే..!

గూగుల్ పిక్సల్ సేఫ్టీ ఫీచర్స్

గూగుల్ పిక్సల్ సేఫ్టీ ఫీచర్స్

పిక్సెల్ మొబైల్స్‌లో మాత్రమే అందించిన పర్సనల్ సేఫ్టీ (Personal Safety) యాప్‌ను ఇతర ఆండ్రాయిడ్ ఫోన్స్‌ (Android Phones)లో కూడా అందుబాటులోకి తెచ్చేలా గూగుల్ ప్లాన్ చేస్తోందని ఒక టెక్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో త్వరలోనే పర్సనల్ సేఫ్టీ యాప్ ఇతర ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌లో కూడా పని చ

ఇంకా చదవండి ...
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) నుంచి వచ్చిన పిక్సెల్ (Pixel) స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేకమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ స్పెషల్ ఫీచర్లు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లలో తప్ప ఇతర ఆండ్రాయిడ్ ఫోన్స్‌కు సపోర్ట్ చేయవు. అయితే కొన్నేళ్లుగా గూగుల్ కేవలం పిక్సెల్ ఫోన్ల కోసమే తీసుకొచ్చిన చాలా ఫీచర్లను క్రమక్రమంగా శాంసంగ్, వన్‌ప్లస్ వంటి నాన్-పిక్సెల్ ఫోన్లకు కూడా రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా పిక్సెల్ మొబైల్స్‌లో మాత్రమే అందించిన పర్సనల్ సేఫ్టీ (Personal Safety) యాప్‌ను ఇతర ఆండ్రాయిడ్ ఫోన్స్‌ (Android Phones)లో కూడా అందుబాటులోకి తెచ్చేలా గూగుల్ ప్లాన్ చేస్తోందని ఒక టెక్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో త్వరలోనే పర్సనల్ సేఫ్టీ యాప్ ఇతర ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌లో కూడా పని చేస్తుందని చెప్పొచ్చు.

ప్రస్తుతం గూగుల్ మరిన్ని పిక్సెల్ సేఫ్టీ ఫీచర్లను ఇతర ఫోన్లకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ కొత్త నివేదిక తెలిపింది. ముఖ్యంగా పర్సనల్ సేఫ్టీ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు తీసుకురానున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఈ యాప్ ఇప్పటి వరకు పిక్సెల్ ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ అందుబాటులోకి రావచ్చు. ఇటీవల ప్రముఖ టెక్ వెబ్‌సైట్ 9to5Google లో పనిచేస్తున్న ఉద్యోగులు పర్సనల్ సేఫ్టీ యాప్‌ లేటెస్ట్ వెర్షన్‌ను బ్రేక్ డౌన్ చేసి కొన్ని కొత్త కోడ్స్ కనుగొన్నారు. ఈ కోడ్స్ ఇతర ఫోన్లకు కూడా పర్సనల్ సేఫ్టీ యాప్ సపోర్ట్ చేయనుందని సూచించినట్లు తెలిపారు.

పర్సనల్ సేఫ్టీ యాప్ అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న యూజర్లకు సహాయం అందించడంలో సహాయపడుతుంది. ఈ యాప్‌లో ఎమర్జెన్సీ SOS, కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ షేరింగ్, సేఫ్టీ చెక్, క్రైసెస్/సంక్షోభాల గురించి అలర్ట్స్, ఎమర్జెన్సీ ఇన్ఫో వంటి ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. ఈ సేవలతో అత్యవసర పరిస్థితులలో ఉన్న యూజర్లు తమ కాంటాక్ట్స్‌ని లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను సులభంగా సంప్రదించడం సాధ్యమవుతుంది. ఈ యాప్ ద్వారా సమీపంలో సంభవించే భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు, పబ్లిక్ ఎమర్జెన్సీల గురించి కూడా తెలుసుకోవచ్చు.

యాప్ ఇంటర్నల్ కోడ్ సాధారణంగా పిక్సెల్‌కి మాత్రమే సపోర్ట్ చేసేలా ఉంటుంది. అయితే గూగుల్ దీన్ని నాన్‌పిక్సెల్ ఫోన్‌లకు కూడా సపోర్ట్ చేసేలా మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పర్సనల్ సేఫ్టీ యాప్‌ను అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎప్పుడు అందుబాటులో తెస్తుందనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ యాప్‌ని ప్లే స్టోర్ సర్వీసెస్ ద్వారా అందరికీ అందించొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఈ పర్సనల్ సేఫ్టీ యాప్ ఎలా పని చేస్తుంది అనేది వివరంగా తెలుసుకునేందుకు ఈ లింక్ https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.safetyhub పై క్లిక్ చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Android, Google, Safety apps, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు