లొకేషన్ ఆఫ్ చేసినా ట్రాక్ చేస్తామంటున్న గూగుల్!

అనుమతి లేకుండా యూజర్ల లొకేషన్‌ని గూగుల్ ట్రాక్ చేస్తుందన్న వార్తలు నాలుగైదు రోజులుగా కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పుడు గూగుల్ సైతం ఒప్పుకోవడం మరో సంచలనం.

news18-telugu
Updated: August 17, 2018, 5:30 PM IST
లొకేషన్ ఆఫ్ చేసినా ట్రాక్ చేస్తామంటున్న గూగుల్!
(Image: REUTERS/Charles Platiau)
  • Share this:
మీరు ఏ టైమ్‌లో ఎక్కడున్నారు..? ఎప్పుడెప్పుడు ఏమేం చేశారు..? ఇలా ప్రతీ విషయాన్ని గూగుల్ ట్రాక్ చేస్తోంది. మీ ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంచితే రోజులో 24 గంటలు మీ కదలికలన్నీ గూగుల్ గుప్పిట్లో ఉన్నట్టే. మీరు ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకున్నా సరే గూగుల్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు గూగుల్ ప్రతీ క్షణం తెలుసుకుంటోంది. గూగుల్ సేవలపై అసోసియేటెడ్ ప్రెస్ అధ్యయనం జరిపి ఆ ఫలితాలను ఇటీవల బయటపెట్టింది. ప్రైవసీ సెట్టింగ్స్‌లో లొకేషన్ ఆపేసినా సరే గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తోందని ఆ అధ్యయనంలో తేలింది. వాస్తవానికి గూగుల్ ముందుగానే లొకేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు అనుమతి అడుగుతుంది. గూగుల్ మ్యాప్స్ లాంటి యాప్స్ నేవిగేషన్ కోసం లొకేషన్ యాక్సెస్ కోసం అడుగుతుంటాయి. మీరు అంగీకరిస్తేనే లొకేషన్ టైమ్ రికార్డవ్వాలి. కానీ గూగుల్ మీ అనుమతి లేకుండానే లొకేషన్ డేటా సేవ్ చేసుకుంటుంది. ఈ డేటాను అడ్వర్‌టైజ్‌మెంట్ కోసం ఉపయోగించుకుంటుంది.

అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మీరు సరిగ్గా ఎక్కడ ఉన్నారో ట్రాక్‌ చేయగలుగుతుంది గూగుల్. ఈ విషయాన్ని అసోసియేటెడ్ ప్రెస్ బయటపెట్టడంతో ప్రపంచమంతా ఇదే అంశంపై చర్చ మొదలైంది. యూజర్లలో భయం, ఆందోళన ఎక్కువయ్యాయి. అన్నివైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో గూగుల్ తన హెల్ప్ పేజీలో కొన్ని వాక్యాలను మార్చింది. "గూగుల్ ఎక్స్‌పీరియెన్స్‌ని మెరుగుపర్చేందుకు" యూజర్ల లొకేషన్ డేటా ట్రాక్ చేస్తున్నామని వివరిస్తోంది. అంతకుముందు "మీ లొకేషన్ హిస్టరీని ఎప్పుడైనా ఆఫ్ చేయొచ్చు. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసిన తర్వాత మీరు వెళ్లే ప్రాంతాలు స్టోర్ చేయబోము" అని గూగుల్ పేజీలో కనిపించేది. "ఈ సెట్టింగ్ మీ డివైజ్‌లోని గూగుల్ లొకేషన్ సర్వీసెస్, ఫైండ్‌ మై డివైజ్, మిగతా లొకేషన్ సర్వీసులపై ప్రభావం చూపించదు. సెర్చ్, మ్యాప్స్‌లాంటి సేవల్ని మెరుగుపర్చేందుకు మీ లొకేషన్ డేటాలో కొంత భాగాన్ని సేవ్‌ చేస్తుంటాం" అని ప్రస్తుతం పేజీలో కనిపిస్తోంది. అంటే గూగుల్ వివరణ చూస్తే... యూజర్ల ప్రమేయం లేకుండా లొకేషన్ ట్రాక్ చేస్తుందని అర్థమవుతోంది.

ఇలా లొకేషన్ స్టోర్ చేసుకోకూడదు అంటే "వెబ్, యాప్ యాక్టివిటీ" సెట్టింగ్‌ని కూడా టర్న్ ఆఫ్ చేయాలని గతంలో చెప్పింది గూగుల్. ఈ సెట్టింగ్‌లో గూగుల్ యాప్స్, వెబ్‌సైట్స్‌కు సంబంధించిన చాలా సమాచారం గూగుల్ అకౌంట్‌లో స్టోర్ అవుతుంది. మీ యాక్టివిటీ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే myactivity.google.com లో లాగిన్ అవ్వాలి.

ఇవి కూడా చదవండి:గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!

గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్లు పోతాయ్!
First published: August 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు