'toilet paper' అని సెర్చ్ చేస్తే పాకిస్తాన్ జెండా కనిపిస్తుందా? కాదంటున్న గూగుల్

గూగుల్‌లో 'toilet paper' అని సెర్చ్‌ చేస్తే పాకిస్తాన్ జెండాలు కనిపిస్తున్నాయంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టులు, స్టేటస్‌ అప్‌డేట్స్ వైరల్ అయ్యాయి.

news18-telugu
Updated: February 19, 2019, 9:50 PM IST
'toilet paper' అని సెర్చ్ చేస్తే పాకిస్తాన్ జెండా కనిపిస్తుందా? కాదంటున్న గూగుల్
'toilet paper' అని సెర్చ్ చేస్తే పాకిస్తాన్ జెండా కనిపిస్తుందా? కాదంటున్న గూగుల్
news18-telugu
Updated: February 19, 2019, 9:50 PM IST
బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వాల్డ్, టాయిలెట్ పేపర్, చైనా మేడ్ టాయిలెట్ పేపర్ అని సెర్చ్ చేస్తే పాకిస్తాన్ జెండా కనిపిస్తోందన్న కథనాలను గూగుల్ ఖండించింది. తమ సెర్చ్ ఆల్గరిథమ్స్ ఆ విధంగా లేవని గూగుల్ వివరణ ఇచ్చింది. "గూగుల్ ఇమేజెస్‌లో టాయిలెట్ పేపర్ అని సెర్చ్ చేస్తే పాకిస్తాన్ జెండాలు కనిపిస్తున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయినా మేము ఈ అంశంపై విచారణ జరుపుతున్నాం. ఎవరో అలాంటి స్క్రీన్ షాట్స్‌ని సృష్టించారు" అని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు.

Read this: Aadhar Data Leak: ఇండేన్ గ్యాస్ కస్టమర్లు, డీలర్ల ఆధార్ డేటా లీక్

ఫిబ్రవరి 14న పుల్వామా టెర్రక్ ఎటాక్‌లో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు చనిపోయిన తర్వాత గూగుల్‌లో 'toilet paper' అని సెర్చ్‌ చేస్తే పాకిస్తాన్ జెండాలు కనిపిస్తున్నాయంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టులు, స్టేటస్‌ అప్‌డేట్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు 'toilet paper' అని సెర్చ్ చేస్తే ఇందుకు సంబంధించిన వార్తలు పోస్ట్ చేసిన వెబ్‌సైట్లల్లో కథనాలు కనిపిస్తున్నాయి.

Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

Jobs: మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగాలు... భారీ జీతాలు...
First published: February 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...