హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Chromecast With TV: గూగుల్ కొత్త టీవీ.. సూపర్ ఫీచర్స్.. ధరెంతో తెలుసా..?

Chromecast With TV: గూగుల్ కొత్త టీవీ.. సూపర్ ఫీచర్స్.. ధరెంతో తెలుసా..?

స్మార్ట్ టీవీ

స్మార్ట్ టీవీ

సరికొత్త గూగుల్ క్రోమ్‌కాస్ట్ (Google Chromecast) డివైజ్ త్వరలో ఇండియాలో లాంచ్ కాబోతోంది. 4K సపోర్ట్‌తో రానున్న ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ కొత్త ప్రొడక్ట్‌ను ధరతో పాటు తన వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఉంచిం?

ఇంకా చదవండి ...

సరికొత్త గూగుల్ క్రోమ్‌కాస్ట్ (Google Chromecast) డివైజ్ త్వరలో ఇండియాలో లాంచ్ కాబోతోంది. 4K సపోర్ట్‌తో రానున్న ఈ గూగుల్ క్రోమ్‌కాస్ట్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ కొత్త ప్రొడక్ట్‌ను ధరతో పాటు తన వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఉంచింది. ఈ ప్రొడక్ట్ స్టేటస్‌ను కమింగ్ సూన్ (Coming Soon) అంటూ ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దీనితో లాంచ్ తేదీ ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీ 4K (Google Chromecast With TV 4K)ని లిస్ట్‌ చేసి దీని ధరను రూ.6,399గా తెలిపింది. ఈ 4K వెర్షన్‌ మంచు (Snow) లాంటి తెలుపు రంగులో లాంచ్ కానుందని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. సాధారణంగా ఏదైనా ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఒక ప్రొడక్ట్‌ను లిస్ట్ చేసిందంటే అది అతి త్వరలో లాంచ్ అవుతుందని అర్థం. అలాగే గూగుల్ క్రోమ్‌కాస్ట్ కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వొచ్చు.

నిజానికి గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీ అధికారికంగా కొన్నేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. కంపెనీ 2020లో పిక్సెల్ 4a 5G, పిక్సెల్ 5తో పాటు ఈ డివైజ్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ డివైజ్‌ ఇప్పటి వరకు భారత్‌లో లాంచ్ కాలేదు. కాగా గత నెలలో గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీని భారత్‌తో సహా మరో 12 దేశాలలో లాంచ్ చేస్తామని కంపెనీ ఒక నివేదికలో పేర్కొంది. గూగుల్ ఈ డివైజ్‌ను లాంచ్ చేసే ముందు అందులోని ఫీచర్లను ఇండియన్ యూజర్ల అవసరాలకు తగినట్లుగా ఇవ్వాలని భావిస్తోంది. ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు అన్ని దేశాలలో కూడా లోకల్ పీపుల్‌కు అవసరమయ్యే ఫీచర్లను తీసుకు రావాల్సి ఉంది. ఈ కారణంగానే ఈ డివైజ్ ఇంకా ఇండియాలో లాంచ్ కాలేదని తెలుస్తోంది. ఇండియా వంటి దేశాలలో ప్రజలు అనేక భాషలను మాట్లాడతారు, కాబట్టి వాటిని డివైజ్‌లో చేర్చడం తప్పనిసరిగా మారుతుంది. వీటిని కొత్తగా చేర్చాలంటే సమయంతో కూడుకున్న పని.

* గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీ ఫీచర్లు

ఈ క్రోమ్‌కాస్ట్ ప్రతి సెకన్‌కు 60 ఫ్రేమ్‌ల చొప్పున 4K HDR క్వాలిటీ వీడియోలను అందిస్తుంది. అంటే 60Hz రిఫ్రెష్ రేట్‌ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుందని చెప్పవచ్చు. వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి డాల్బీ విజన్‌ సపోర్ట్‌తో కూడా ఇది వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ కోసం డెడికేటెడ్ బటన్‌లతో క్రోమ్‌కాస్ట్ రిమోట్‌ను యూజర్లు పొందవచ్చు. ఇందులో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. కంపెనీ కొత్త క్రోమ్‌కాస్ట్‌లో సింపుల్ యూఐ గల గూగుల్ టీవీకి యాక్సెస్‌ను అందించింది. ఈ డివైజ్‌లో రకరకాల యాప్స్‌, ఫీచర్‌లను యూజర్లు ఉండవచ్చు. గూగుల్ క్రోమ్‌కాస్ట్ విత్ టీవీ 4కె వెర్షన్‌ను లిస్టెడ్ ధరతో లాంచ్ చేస్తే అది దేశంలో అత్యంత ఖరీదైన కాస్టింగ్ డివైజ్ అవుతుంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కె మ్యాక్స్ మోడల్‌ ఇప్పుడు దేశంలో ఖరీదైన డివైజ్‌గా ఉంది.

Published by:Mahesh
First published:

Tags: Android, Google, Smart TV, Tech news

ఉత్తమ కథలు