Home /News /technology /

GOOGLE CHROME SET AUTOFILL OPTION TO REMEMBER PASSWORDS UMG GH

Passwords Settings: పాస్‌వర్డ్స్‌ గుర్తుంచుకోవడం ఇబ్బందిగా ఉందా..? గూగుల్ క్రోమ్‌లో ఈ ఫీచర్‌ మీకోసమే..

గూగుల్ పాస్‌వర్డ్స్.

గూగుల్ పాస్‌వర్డ్స్.

మీ పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలను మాన్యువల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్. క్రోమ్ బ్రౌజర్‌లో చాలా సింపుల్‌గా మీ అన్ని పాస్‌వర్డ్స్ సేవ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఇంకా చదవండి ...
మీకు వివిధ వెబ్‌సైట్లకు, యాప్స్ (Apps) లాగిన్‌కు పాస్‌వర్డ్ (Password) పెట్టుకునే అలవాటు ఉందా? వాటిని గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తోందా? అప్పుడప్పుడూ పాస్‌వర్డ్స్‌ మర్చిపోతుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ పాస్‌వర్డ్‌లు, లాగిన్ (Login) వివరాలను మాన్యువల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్. క్రోమ్ బ్రౌజర్‌లో చాలా సింపుల్‌గా మీ అన్ని పాస్‌వర్డ్స్ సేవ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. అంతేకాదు, ఏదైనా సైట్‌ను మళ్లీ ఓపెన్ చేసినప్పుడు పాస్‌వర్డ్‌, లాగిన్ వివరాలను ఆటోమెటిక్‌గా ఫిల్ చేసే ఆప్షన్ యూజర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలంటే.. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి క్రోమ్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయాలి. క్రోమ్‌లో ఉండే బిల్ట్ ఇన్ పాస్‌వర్డ్ మ్యానేజర్‌ను డెస్క్‌టాప్, మొబైల్‌లో ఎనేబుల్ చేయాలి.

పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్‌ మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అయితే మీ గూగుల్ అకౌంట్‌ను ఎవరైనా, ఎప్పుడైనా హ్యాకింగ్ చేస్తే, మీ ముఖ్యమైన పాస్‌వర్డ్‌లు అన్నీ హ్యాకర్లకు తెలుస్తాయి. కాబట్టి దీంట్లో రిస్క్ కూడా ఉంటుంది. అందుకే యూజర్లు జాగ్రత్తపడాలి.

గూగుల్ క్రోమ్‌లో సింక్ ఆప్షన్‌ను ఆన్ చేస్తే.. మీ గూగుల్ అకౌంట్‌లో పాస్‌వర్డ్‌లు సేవ్ అవుతాయి. తద్వారా మీరు సైన్ ఇన్ చేసిన అన్ని డివైజ్‌లలో ఈ పాస్‌వర్డ్‌లను క్రోమ్ ఆటోమెటిక్‌గా సేవ్ చేస్తుంది. అంటే, మీరు డెస్క్‌టాప్‌లోని క్రోమ్ బ్రౌజర్‌లో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసే ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తే.. ఆ సెట్టింగ్ మీ స్మార్ట్‌ఫోన్‌లోని క్రోమ్ యాప్‌కు కూడా వర్తిస్తుంది. డెస్క్‌టాప్, మొబైల్‌లలో గూగుల్ క్రోమ్ ఆటోఫిల్ పాస్‌వర్డ్స్ ఎనేబుల్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏవో చూద్దాం. ప్రారంభించడానికి ఇక్కడ దశల వారీ గైడ్ ఉంది.

స్టెప్- 1:
ముందు మీ కంప్యూటర్/ ల్యాప్‌టాప్/ విండోస్ లేదా మొబైల్‌లో క్రోమ్ యాప్‌ ఓపెన్ చేసి, టాప్ రైట్ కార్నర్‌లో ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేయండి.

స్టెప్- 2:
ఇప్పుడు ‘Settings’ ఆప్షన్‌ను ఎంచుకుని, ఎడమ వైపు సైడ్‌బార్‌లో కనిపించే ‘Autofill’ ట్యాబ్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్- 3:
ఇప్పుడు “Passwords”పై క్లిక్ చేస్తే.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో “Offer to Save Passwords” ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి. మీరు క్రోమ్ నుంచి పాస్‌వర్డ్ సేవ్ చేసే ఫీచర్‌ను ఆపేయాలని భావిస్తే.. ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు.

స్టెప్- 4:
ఈ సెట్టింగ్స్ పూర్తయిన తర్వాత, మీరు సైట్‌కి లాగిన్ అయిన ప్రతిసారీ మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని బ్రౌజర్ మిమ్మల్ని అడుగుతుంది. మీరు క్రోమ్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను మాన్యువల్‌గా కూడా చెక్ చేసుకోవచ్చు.

ఐఫోన్‌లు లేదా ఐప్యాడ్‌లకు కూడా ఈ ప్రక్రియ దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ ఈ డివైజ్‌లలో మూడు చుక్కల మెనూ కిందివైపు ఉంటుంది. అయితే ఈ సెట్టింగ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు క్రోమ్ యాప్‌ను అప్‌డేటెడ్ చేసుకోవాలి.
Published by:Mahesh
First published:

Tags: Apps, Google, Password, Website

తదుపరి వార్తలు