Home /News /technology /

GOOGLE CHAT NEW AUDIO AND VIDEO CALLING FEATURE IN GOOGLE CHAT KNOW HOW TO USE GH EVK

Google Chat: గూగుల్​ చాట్​లో కొత్తగా ఆడియో, వీడియో కాలింగ్​ ఫీచర్​.. ఎలా ఉపయోగించాలంటే?

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Google Chat: టెక్​ దిగ్గజం గూగుల్ (Google)​ తమ వర్క్​ స్పేస్​ ఫోరంలో కొత్త ఫీచర్ల (New Features)ను అందుబాటులోకి తెస్తుంది. ఆండ్రాయిడ్ (Android)​, ఐఓఎస్ డివైజ్​లలో జీమెయిల్(G-mail)​ వాడే వారి కోసం వరుసగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. జీమెయిల్​లోని గూగుల్ చాట్ ద్వారా ఇప్పుడు 1:1 ఆడియో, వీడియో కాలింగ్​ సదుపాయాన్ని పొందే అవకాశం కల్పించింది. ఈ ఫీచర్​ను గూగుల్​ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది.

ఇంకా చదవండి ...
టెక్​ దిగ్గజం గూగుల్ (Google)​ తమ వర్క్​ స్పేస్​ ఫోరంలో కొత్త ఫీచర్ల (New Features)ను అందుబాటులోకి తెస్తుంది. ఆండ్రాయిడ్ (Android)​, ఐఓఎస్  డివైజ్​లలో జీమెయిల్(G-mail)​ వాడే వారి కోసం వరుసగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇటీవల జీమెయిల్​ యాప్​లో కొత్త సెర్చ్​ ఫిల్టర్​ను యాడ్​ చేసిన గూగుల్​.. ఇప్పుడు మరో ఫీచర్​ను జోడించింది. జీమెయిల్​లోని గూగుల్ చాట్ (Google Chat) ద్వారా ఇప్పుడు 1:1 ఆడియో, వీడియో కాలింగ్​ సదుపాయాన్ని పొందే అవకాశం కల్పించింది. ఈ ఫీచర్​ను గూగుల్​ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ (IOS)​​ ప్లాట్‌ఫారమ్‌లలో మొబైల్ యూజర్ల కోసం కంపెనీ ఈ ప్రత్యేక అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. గతంలో కేవలం 1:1 చాట్‌ సౌకర్యం మాత్రమే జీమెయిల్​లో అందుబాటులో ఉండేది.

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫీచర్​తో మీరు ఆడియో, వీడియో కాల్స్​ను కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాదు, మీరు జీమెయిల్​లో చాట్ రోస్టర్ నుంచి మిస్డ్ కాల్స్​ వివరాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.

Top Gaming Laptops ల్యాప్‌టాప్‌లో గేమ్స్ ఆడుతున్నారా.. టాప్ 7 గేమింగ్ ల్యాప్‌టాప్‌లు ఇవే..


మరోవైపు, ప్రాధాన్యతను బట్టి నేరుగా ఆడియో లేదా వీడియో కాల్ (Video Call) చేసుకునే అవకాశం కల్పించింది. స్క్రీన్ పైభాగంలోని బ్లూ కలర్​ బ్యానర్‌ ద్వారా కొత్తగా వచ్చిన కాల్స్​, మెసేజెస్ గురించి జీమెయిల్ మీకు తెలియజేస్తుంది. మీతో కాల్‌లో ఉన్న వ్యక్తి పేరు, కాల్ వ్యవధిని చూపిస్తుంది. అదేవిధంగా, మీ మొబైల్​కు వచ్చే మిస్డ్​ కాల్స్​ను ఎరుపు రంగులో చూపిస్తుంది.

జీమెయిల్​ తాజా వెర్షన్​లో మాత్రమే..

వ్యక్తిగత గూగుల్​ ఖాతాల (Personal Account)తో పాటు గూగుల్​ వర్క్​స్పేస్​, జీ సూట్​ బేసిక్​, బిజినెస్ కస్టమర్​ అకౌంట్లు గల యూజర్లందరికీ ఈ కొత్త కాలింగ్ ఫీచర్​ను తీసుకొచ్చింది. అయితే, ఈ ఫీచర్​ను ఆస్వాదించాలంటే కాల్స్ చేసే యూజర్​, స్వీకరించే యూజర్​ ఇద్దరూ జీమెయిల్​ తాజా వెర్షన్​ను ఉపయోగిస్తుండాలి. అప్పుడే, వారికి ఈ ఫీచర్​ కనిపిస్తుంది.

OnePlus: అమెజాన్​లో వన్​ప్లస్​ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు​.. ఏకంగా రూ.13వేల వరకు డిస్కౌంట్


"కరోనా తగ్గుముఖం పట్టడంతో అనేక కంపెనీలు హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో సహోద్యోగులతో కనెక్ట్ అవ్వడాన్ని తాజాగా ఫీచర్​ సులభతరం చేస్తుందని మేము ఆశిస్తున్నాం.’’ అని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

ఈ ఫీచర్​ ద్వారా అవసరమైనప్పుడు వీడియో లేదా ఆడియో కాల్స్ (Audio Calls) మధ్య సజావుగా మారడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది. కాగా, ఈ ఫీచర్​ మొదట్లో గూగుల్​ వర్క్​స్పేస్​ యూజర్ల (Users)కు మాత్రమే తేవాలని గూగుల్​ భావించింది. అయితే, ఇప్పుడు సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్​ కోసం ముందుగా జీమెయిల్​ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్​ మెనూ ఎంచుకోవాలి. దానిలో జనరల్ ఆప్షన్​ను ఎంచుకొని చాట్‌ ఆన్ చేయాలి. తద్వారా మీరు జీమెయిల్​లో గూగుల్​ చాట్​ని ప్రారంభించవచ్చు.
Published by:Sharath Chandra
First published:

Tags: Android, GMAIL, Google, Google Chat, Ios, Latest Technology, Smart phone

తదుపరి వార్తలు