‘మీటూ’ మూమెంట్‌పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సెన్సేషనల్ కామెంట్స్

గడిచిన రెండేళ్ల కాలంలో గూగుల్ సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని ప్రకటించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 26, 2018, 5:26 PM IST
‘మీటూ’ మూమెంట్‌పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సెన్సేషనల్ కామెంట్స్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(ఫైల్ ఫోటో)
  • Share this:
సీనియర్ బాలీవుడ్ నటుడు నానాపటేకర్‌పై హీరోయిన్ తనుశ్రీదత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో మళ్లీ ఆరంభమైన ‘మీటూ’ మూమెంట్ యావత్ భారతంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ, రాజకీయ, క్రీడారంగాల్లో ప్రముఖులు పేరొందిన వారెందరో ‘మీటూ’ మూమెంట్‌లో చిక్కుక్కుని అప్రతిష్ట పాలవుతున్నారు. తాజాగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ‘మీటూ’ మూమెంట్‌పై స్పందించాడు. గడిచిన రెండేళ్ల కాలంలో గూగుల్ సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని సుందర్ పిచాయ్ వెల్లడించడం కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది.

గూగుల్ సంస్థలో ఉద్యోగం పొందడం అంటే అంత తేలీక కాదు. టాప్ ర్యాంకర్లు కూడా గూగుల్‌లో ఉద్యోగం పొందాలంటే ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడేవారు ఉన్నారని స్వయంగా ఆ సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే వెల్లడించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వివరాలను తెలుపుతూ సుందర్ పిచాయ్ ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు ఓ ఈమెయిల్ పంపించారు.

పని చేసే ప్రదేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించే విషయంలో గూగుల్ కట్టుబడి ఉందని తెలిపిన సుందర్, ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన 13 మంది సీనియర్ మేనేజర్లను కూడా విధుల్లోంచి తొలగించినట్టు తెలిపారు. సంస్థలో పనిచేసే ఉద్యోగినులు తమకు ఎదురైన లైంగిక వేధింపులను ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, అందులో ఆరోపణలు చేసిన వారికి అన్నిరకాలుగా మద్ధతు ఇస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి..

#MeToo: దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో 588 వేధింపుల ఫిర్యాదులు
First published: October 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading