news18-telugu
Updated: November 1, 2019, 7:49 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేసింది. సుమారు 2.1 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో రూ.14,845 కోట్లు) ఫిట్‌బిట్‌ను గూగుల్ కొనేసింది. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేస్తుందంటూ గతంలోజరిగిన ప్రచారానికి ఈ డీల్‌తో శుభం కార్డు పడింది. ఈ డీల్ వల్ల ‘ఆపరేటింగ్ సిస్టమ్‌ను ధరించే’ (WearOS) రంగంలో గూగుల్ మరింత పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు పెరిగాయిన డీల్ ఓకే అయిన తర్వాత ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (డివైజ్ & సర్వీస్) రిచ్ ఆస్టర్‌లో ఓ బ్లాగ్‌లో పేర్కొన్నారు.
శాంసంగ్, యాపిల్ తరహాలోనే గూగుల్ కూడా తమ సొంత ఫోన్లను తయారు చేస్తోంది. దీంతోపాటు ఆయా కంపెనీలు స్మార్ట్ వాచ్‌ల విభాగంలో కూడా ముందున్నాయి. ఈ రంగంలో గూగుల్ తన మార్క్ చూపించలేకపోతోంది. అదే సమయంలో అమెరికాలో ఫిట్నెస్ ట్రాకర్ వాచ్‌లు తయారు చేసే ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయడం ద్వారా యాపిల్, శాంసంగ్ కంపెనీలకు పోటీ ఇవ్వొచ్చని అంచనా వేస్తోంది.
ఫిట్‌బిట్ స్మార్ట్ వాచీ వినియోగదారుల కోసం కొన్ని రోజుల క్రితం హెల్త్ ఇన్సూరెన్స్‌లు తీసుకొచ్చింది. ఆరోగ్య సూత్రాలు చెప్పేందుకు నిపుణులను నియమించింది. అయితే, దానికి సంబంధించిన డేటా ఏమవుతుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. అయితే, ఆ డేటా విషయంలో అత్యంత పారదర్శకంగా ఉంటామని గూగుల్ తెలిపింది. యాడ్స్ కోసం ఫిట్‌బిట్ డేటాను టార్గెట్ చేయబోమని పేర్కొంది. యూజర్లు తమ డేటాను పునరుద్ధరించుకోవడం, డిలీట్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 1, 2019, 7:41 PM IST