హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

SmartTV: స్మార్ట్ టీవీ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్స్ ట్రై చేయండి

SmartTV: స్మార్ట్ టీవీ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్స్ ట్రై చేయండి

SmartTV: స్మార్ట్ టీవీ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్స్ ట్రై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

SmartTV: స్మార్ట్ టీవీ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్స్ ట్రై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Android TV New Features | ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు సరికొత్త ఫీచర్స్‌ని అందిస్తోంది గూగుల్. వాటితో ఉపయోగమేంటో తెలుసుకోండి.

  మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా? ఆండ్రాయిడ్ టీవీ కొన్నారా? అయితే మీకు శుభవార్త. ఆండ్రాయిడ్ టీవీలో మీరు ఏవైనా యాప్స్ వాడాలంటే ఇకపై డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డౌన్‌లోడ్ చేయకుండానే యాప్స్, కొత్త గేమ్స్ ట్రై చేయొచ్చు. ఆ యాప్ లేదా గేమ్ ఎలా ఉందో టెస్ట్ చేసేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. వాటిని డౌన్‌లోడ్ చేయకుండా ట్రై చేసి నచ్చితేనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. 2017లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయకుండానే ట్రై చేయొచ్చు. ట్రై చేసిన తర్వాత ఆ యాప్ తమకు ఉపయోగపడుతుందనుకుంటేనే డౌన్‌లోడ్ చేయొచ్చు. దీని వల్ల డౌన్‍లోడ్ చేయడానికి ఖర్చయ్యే డేటా మిగులుతుంది. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు రిలీజ్ చేసింది గూగుల్. యాప్ లేదా గేమ్ ఓపెన్ చేయగానే ఇన్‌స్టాల్ ఆప్షన్ పక్కన ఉంటే Try Now బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ టీవీ యూజర్లు అయితే ఇకపై గేమ్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేయకుండానే ట్రై చేయండి. గూగుల్ లెక్క ప్రకారం ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు గూగుల్ ప్లేలో 7000 పైగా అప్లికేషన్స్, గేమ్స్ ఉన్నాయి.

  Smartphone: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  WhatsApp Banking: మీ వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవల్ని పొందండి ఇలా...

  అంతేకాదు... జీబోర్డ్ టీవీ పేరుతో వర్చువల్ కీబోర్డును ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు అందించనుంది గూగుల్. ఇక దీంతో పాటు 4-డిజిట్ పిన్ ఫెసిలిటీని కూడా అందిస్తోంది. దీని వల్ల యూజర్లు యాప్ ఓపెన్ చేయడానికి ప్రతీసారి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 4-డిజిట్ పిన్ ఎంటర్ చేస్తే చాలు. యాప్ ఓపెన్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు రానుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android TV, Smart TV

  ఉత్తమ కథలు