Home /News /technology /

GOOGLE BRINGS NEW SEARCH FEATURE TO INFORM USERS ABOUT FAKE NEWS HERE FULL DETAILS NS GH

Google Search: ఫేక్ న్యూస్ పని పట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్​.. ఆ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవలి కాలంలో ఫేక్ న్యూస్ సంచారం అధికమై ప్రజలు గందరగోళానికి గురవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫేక్ న్యూస్ పని పట్టడానికి గూగుల్​ అతి ముఖ్యమైన ఫీచర్​ను త్వరలోనే సెర్చ్ విభాగం​లో తీసుకురానుంది.

ఫేక్​న్యూస్​.. ప్రపంచంలో ఇదో పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం కరోనా సహా ముఖ్యమైన అంశాల్లో చక్కర్లు కొడుతున్న తప్పుడు సమాచారాలు పెద్ద తలనొప్పిగా మారాయి. కొందరు పని గట్టుకొని మరీ వీటిని సృష్టిస్తుంటే.. మరికొందరు తెలియక ఈ ఫేక్​న్యూస్​ను షేర్ చేస్తున్నారు. దీంతో కొందరు ప్రజలు వీటిని నమ్ముతున్నారు. దీంతో ఈ ఫేక్​న్యూస్​కు చెక్​ పెట్టేందుకు ట్విట్టర్​, ఫేస్​బు​క్​, గూగుల్​ ముందుకొచ్చాయి. మ్యానుపులేటెడ్​ మీడియా లేబుల్​తో ఇలాంటి సమాచారాన్ని ట్విట్టర్ ఫిల్టర్ చేస్తోంది. అలాగే తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫేస్​బుక్ కొన్ని టూల్స్ తెచ్చినా అవి ప్రస్తుతం సరిపోవడం లేదు. ఈ తరుణంలో గూగుల్​ అతి ముఖ్యమైన ఫీచర్​ను సెర్చ్ విభాగం​లో తీసుకురానుంది. గూగుల్​లో సెర్చ్ చేయగానే ఫేక్​ న్యూస్​ను గుర్తించి.. యూజర్లను హెచ్చరించే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన సమావేశంలో గూగుల్ ఈ ఫీచర్​ గురించి చర్చించింది. సెర్చ్​లో “అబౌట్​ దిస్​ రిజల్ట్​” ఫీచర్ తీసుకొచ్చి.. ఆ సమాచారం ఎక్కడి నుంచి.. ఏ సోర్స్ నుంచి వచ్చిందో తెలియజేయనుంది.
Best Recharge Plans: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 299కే డైలీ 4 జీబీ డేటా.. ప్లాన్ వివరాలివే

ఇందుకోసం వికిపీడియాతోనూ గూగుల్ పని చేయనుంది. వెబ్​సైట్ వివరణ ఎలా ఉందని యూజర్లు చూడడంతో పాటు దాని వికిపీడియా పేజీల లింక్​లు యూజర్లకు కనిపించనున్నాయి. “వికీపీడియా ఓపెన్ ఎడిట్ మోడల్​ లాగానే, ప్రపంచంలో ఉన్న వేలాది మంది వాలంటీర్లు ఇచ్చే సమాచారంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారం చాలా అప్​డేటెడ్​గా ఉంటుంది. అలాగే సెర్చ్ చేసిన వెబ్​సైట్ గురించి వికీపీడియాలో ఏం సమాచారం ఉందో చూపిస్తుంది” అని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్​లో వెల్లడించింది. ఒకవేళ వెబ్​సైట్లకు వికీపీడియా పేజీలు లేకపోతే, అందుబాటులో ఉన్న సమాచారాన్ని గూగులే యూజర్లకు చూపించనుంది.

అలాగే హెచ్​టీటీపీఎస్​ ఆధారంగా వెబ్​సైట్ సురక్షితమైందా.. కాదా అన్నది కూడా యూజర్లకు గూగుల్ చూపించనుంది. దీనిద్వారా బ్రౌజింగ్ డేటా సురక్షితంగా, గోప్యంగా ఉందా లేదా అన్నది కనిపెట్టవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో గూగుల్ ఫీచర్ తీసుకొచ్చింది. అయితే ఇంగ్లిష్​లో యూజర్లందరికీ ఈ నెలాఖరులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అనేక భాషల్లో ఈ ఫీచర్​ను తీసుకువాలని గూగుల్ ఆలోచిస్తున్నది.

తొలుత ఈ ఫీచర్ ఆండ్రాయిడ్​తో పాటు డెస్క్​టాప్ వర్షన్లకు రానుంది.
ఫేక్​న్యూస్​ను కనిపెట్టి.. యూజర్లకు తెలియజేసే అబౌట్ దిస్ రిజల్ట్​ ఫీచర్​ గూగుల్​ సెర్చ్​లో వస్తే తప్పుడు సమాచారానికి చాలావరకు కళ్లెం పడుతుందని టెక్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు చాలా మంది గూగుల్ సెర్చ్​నే వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెబుతున్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Facebook, Fake news, Google, Google search

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు