GOOGLE BRINGS NEW BOLO APP IN INDIA TO HELP CHILDREN LEARN AND READ HINDI ENGLISH SS
Google BOLO: హిందీ, ఇంగ్లీష్ నేర్పించే గూగుల్ 'బోలో' యాప్
Google BOLO: హిందీ, ఇంగ్లీష్ నేర్పించే గూగుల్ 'బోలో' యాప్
Google BOLO APP | ASER సెంటర్‌తో కలిసి గూగుల్ బోలో యాప్‌ను ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు పరీక్షించింది. ఈ సర్వేలో 64 శాతం మంది పిల్లల్లో మూడు నెలల్లో చదివే నైపుణ్యం పెరిగింది.
మీ పిల్లలకు హిందీ లేదా ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నారా? అయితే గూగుల్ కొత్తగా రిలీజ్ చేసిన 'బోలో' యాప్ డౌన్లోడ్ చేసుకోండి. స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్ టెక్నాలజీ సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించిన యాప్ ఇది. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. కథలు చెబుతుంది. మాటలు నేర్పిస్తుంది.
Read, online and offline. With #Bolo, your child can download and read through a collection of stories, in Hindi and English.
యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ASER) 2018 నివేదిక ప్రకారం భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో 5వ తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాన్ని ఆత్మవిశ్వాసంతో చదవలేరని గూగుల్ చెబుతోంది. నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని, వనరులు సరిగ్గా లేవని భావిస్తున్న గూగుల్... బోలో యాప్‌తో పిల్లల్లో రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయని విశ్వసిస్తోంది. ASER సెంటర్‌తో కలిసి గూగుల్ బోలో యాప్‌ను ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు పరీక్షించింది. ఈ సర్వేలో 64 శాతం మంది పిల్లల్లో మూడు నెలల్లో చదివే నైపుణ్యం పెరిగింది.
గూగుల్ బోలో యాప్‌లో 50 హిందీ కథలు, 40 ఇంగ్లీష్ కథలున్నాయి. వీటితో పాటు వర్డ్ గేమ్స్, యాప్ రివార్డ్స్ వినోదాన్ని పంచుతాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా ఈ యాప్ పనిచేస్తుంది. పిల్లల కోసం గూగుల్ రూపొందించిన బోలో యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. లాభాపేక్ష లేని సంస్థలైన ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, రూమ్ టు రీడ్, సాఝా లాంటి సంస్థలతో కలిసి మరో ఆరు నెలలు పనిచేయనుంది గూగుల్.
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.