Google Assistant: గూగుల్ అసిస్టెంట్ నుంచి త్వరలోనే కొత్త అప్‌డేట్ ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

Google Assistant: గూగుల్ అసిస్టెంట్ నుంచి త్వరలోనే కొత్త అప్‌డేట్ ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

(ప్రతీకాత్మక చిత్రం)

ఇప్పుడు రంగురంగుల రూపంలో గల డార్క్ థీమ్​ను రూపొందించే పనిలో నిమగ్నమైందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సరికొత్త యూఐ విడుదలయ్యే అవకాశం ఉంది.

  • Share this:
ఇంటర్నెట్ సెర్చ్ కంపెనీ గూగుల్ తర్వలోనే సరికొత్త రంగురంగుల యూజర్​ ఇంటర్​ ఫేస్​ (యూఐ)ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ UI చివరిసారిగా దాని విజువల్ రిఫ్రెష్‌ను 2019 చివర్లో రోల్‌అవుట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇది 2020 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చింది. ఈ అప్​డేట్​ తర్వాత గూగుల్​ యూఐలో ఎటువంటి కొత్త అప్​డేట్​ను విడుదల​ చేయలేదు. దీంతో ఇప్పుడు రంగురంగుల రూపంలో గల డార్క్ థీమ్​ను రూపొందించే పనిలో నిమగ్నమైందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సరికొత్త యూఐ విడుదలయ్యే అవకాశం ఉంది. XDA- డెవలపర్ టిప్‌స్టర్ మాథ్యూ పిర్సజెల్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘‘గూగుల్ అసిస్టెంట్ తన థీమ్స్​కు కొత్త రంగులను జోడించనుంది. దీని ద్వారా మీ ఫోన్​ ఆపరేషన్​ కలర్​ఫుల్​గా మారుతుంది. తద్వారా స్మార్ట్​ఫోన్​ వాడే సమయంలో కొత్త అనుభూతి కలుగుతుంది. బయటి లైటింగ్​, వెదర్​ కండీషన్​ బట్టి ఆటోమేటిక్​గా గూగుల్ అసిస్టెంట్ మీ థీమ్​ రంగులను మార్చేస్తుంది. సందర్భాన్ని బట్టి బ్లూ, గ్రీన్​ షేడ్స్ రెండింటినీ వర్తింపజేసింది. అయితే, గూగుల్ ఈ రెండు రంగులనే ఎందుకు ఎంచుకున్నదనే విషయంపై స్పష్టతలేదు.” అని అన్నారు.

మరో మూడు కొత్త ఫీచర్లు..
ఈ అప్​డేట్​ ఆండ్రాయిడ్​ 12 “మోనెట్” థీమింగ్‌ను పోలి ఉంటుందని XDA స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ 12తో పనిచేసే స్మార్ట్​ఫోన్లు వాడే వినియోగదారులు తమ వాల్‌పేపర్​లో నుంచి తమకు నచ్చిన కలర్​ ఎంచుకోవచ్చు. XDA ప్రకారం, ‘మోనెట్’ థీమింగ్​ సిస్టమ్ నోటిఫికేషన్ బ్యాక్​గ్రౌండ్, క్విక్​ సెట్టింగ్‌ యాక్సెంట్, సెట్టింగ్స్​ పేజీ, లాక్‌స్క్రీన్‌ వంటి బ్యాక్​గ్రౌండ్​లకు ఆటోమేటిక్​గా కలర్స్​ను మారుస్తుంది. ఈ ఫీచర్లు ఇప్పటికే సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్​ఫోన్లలో అందుబాటులో ఉన్నట్లు టిప్​స్టార్​ పేర్కొంది. కాగా, గూగుల్ అసిస్టెంట్​ ఇటీవలే మరో మూడు కొత్త ఫీచర్లను చేర్చింది. వాయిస్ బేస్ట్​ అసిస్టెంట్​ అనే కొత్త ఫీచర్​ను జోడించింది. దీని ద్వారా వ్యక్తుల సంభాషణను బట్టి వారిని గుర్తిస్తుంది. యూజర్ కాంటాక్ట్​ లిస్ట్​లోని పేర్లను సైతం పలుకుతుంది. రికార్డు చేయనప్పటికీ మీ వాయిస్, ఉచ్ఛారణను గుర్తుపట్టగలదు. ప్రస్తుతం ఇంగ్లిష్​లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని రాబోయే కాలంలో అన్ని భాషలకు విస్తరించాలని గూగుల్​ యోచిస్తోంది.
Published by:Krishna Adithya
First published: