గూగుల్ అసిస్టెంట్‌లో మరింత లోతుగా గూగుల్ న్యూస్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యూజర్లకు సేవలు అందిస్తున్న గూగుల్ అసిస్టెంట్... ఇకపై వార్తల్ని మరింత లోతుగా ఇవ్వనుంది.

news18-telugu
Updated: August 10, 2018, 5:35 PM IST
గూగుల్ అసిస్టెంట్‌లో మరింత లోతుగా గూగుల్ న్యూస్!
(Image: Sarthak Dogra/ News18.com)
  • Share this:
గూగుల్ అసిస్టెంట్‌ ఇంకా సమర్థవంతంగా సేవలు అందించేలా మెరుగులు దిద్దుకుంది. అమెరికాలో ఇటీవల అప్‌డేట్‌లో ఈ మార్పులు కనిపించాయి. గూగుల్‌ న్యూస్‌కు సంబంధించి గూగుల్ అసిస్టెంట్‌ స్మార్ట్‌ డిస్‌ప్లేతో పాటు గూగుల్ హోమ్ స్పీకర్లకు అనుసంధానించారు. గతంలో గూగుల్ హోమ్ యూజర్లు వారి హోమ్ స్పీకర్లలోనే వార్తలు వినేలా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చేసేది. ఇప్పుడు స్మార్ట్‌ డిస్‌ప్లేలో గూగుల్ న్యూస్‌ వీడియోల రూపంలో కూడా చూడొచ్చు.

అంతే కాదు... ఏదైనా ఓ అంశంపై ఆ రోజు ఏఏ వార్తలున్నాయి అని అడిగితే ఆ వార్తల్ని మాత్రమే చూపించేలా గూగుల్ అసిస్టెంట్‌లో మార్పులొచ్చాయి. ఇది కేవలం గూగుల్ హోమ్ డివైజ్‌లల్లో మాత్రమే కాదు... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు, ఆండ్రాయిడ్ ఆటో, అసిస్టెంట్ ఎనేబుల్డ్ హెడ్‌ఫోన్స్‌లో ఈ మార్పుల్ని తీసుకొచ్చింది గూగుల్. అయితే ఈ అప్‌డేట్స్ ప్రస్తుతం అమెరికాకు మాత్రమే రిలీజ్ చేసిన గూగుల్... త్వరలో ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందించనుంది.

First published: August 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు