GoogleAssistant : తెలుగులోనూ అందుబాటులోకి గూగుల్ అసిస్టెంట్

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే ఇప్పుడున్న గూగుల్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.ఓఎస్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రాంతీయ భాషల్లో గూగుల్ అసిస్టెంట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: September 20, 2019, 7:41 AM IST
GoogleAssistant : తెలుగులోనూ అందుబాటులోకి గూగుల్ అసిస్టెంట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. ఈ క్రమంలో కేవలం ఇంగ్లీష్ భాషకే కాకుండా ఆయా దేశాల్లోని ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ అసిస్టెంట్‌లో ప్రాంతీయ భాషలకు సదుపాయం కూడా కల్పించింది. తాజాగా గూగుల్ అసిస్టెంట్‌ను మన దేశంలోని 8 ప్రాంతీయ భాషల్లో ఉపయోగించుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందులో తెలుగుతో పాటు హిందీ, గుజరాతీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ,తమిళ భాషలు కూడా ఉన్నాయి.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే ఇప్పుడున్న గూగుల్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.ఓఎస్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రాంతీయ భాషల్లో గూగుల్ అసిస్టెంట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.కొత్త సదుపాయం ద్వారా ఇండియాలో గూగుల్ మరింత మందికి చేరువవుతుందని ఆ సంస్థ భావిస్తోంది.

ఇండియన్ యూజర్స్ ఇకపై తమ ప్రాంతీయ భాషల్లో గూగుల్ అసిస్టెంట్ సేవలను పొందవచ్చు. ఇది చాలా సులువైన ప్రక్రియ. ఉదాహరణకు
మీరు హిందీలో గూగుల్ అసిస్టెంట్ సేవలు పొందాలనుకుంటే.. 'హే గూగుల్,టాక్ టు మి ఇన్ హిందీ' అని సెర్చ్ ఇంజిన్ వాయిస్ స్పీకర్‌లో మాట్లాడితే చాలు.దీనికోసం ఎలాంటి సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
గూగుల్ సంస్థ ప్రతినిధి


First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>