మీ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ ఉందా? ఈ న్యూస్ మీకోసమే!

గూగుల్ అసిస్టెంట్ ఇక డ్యుయో వీడియో కాల్స్ మేనేజ్ చేయనుంది. ఈ మొబైల్ వీడియో చాట్ యాప్ సాయంతో మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, మెసేజ్ యాప్స్‌లోని నెంబర్స్‌కి వీడియో కాల్స్ చేయొచ్చు.

news18-telugu
Updated: July 24, 2018, 2:45 PM IST
మీ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ ఉందా? ఈ న్యూస్ మీకోసమే!
(Image: Sarthak Dogra/ News18.com)
  • Share this:
మీ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ ఉందా? ఆ యాప్‌ని అప్‌డేట్ చేశారా? అయితే మీరు ఇక గూగుల్ అసిస్టెంట్ నుంచి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ వీడియో చాట్ యాప్ "డ్యుయో" నుంచి ఈ కాల్స్ వెళ్తాయి. ఫోన్‌లో, కాంటాక్ట్స్‌లో, ఇతర యాప్‌లో ఉన్న నెంబర్స్‌కి ఈ కాల్స్ చేసుకోవచ్చు. "వీడియో కాల్ (పేరు)" అని పలికితే చాలు అసిస్టెంట్ కాల్ కనెక్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు ట్యాబ్లెట్స్‌లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఆండ్రాయిడ్ 8.0 ఆ పైస్థాయి ఓఎస్ వాడుతున్నవారికే ఈ కాల్స్ చేసుకోవడం సాధ్యం. "డ్యుయో" సెట్టింగ్స్‌లో "అకౌంట్ సింక్" ఆప్షన్ క్లిక్ చేసి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. డ్యుయో యాప్ లేకపోతే మరో వీడియో చాట్ ప్లాట్‌ఫామ్ అయిన "హ్యాంగవుట్స్" నుంచి కాల్స్ వెళ్తాయి.
Published by: Santhosh Kumar S
First published: July 24, 2018, 2:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading