GOOGLE ASSISTANT ALERT ANDROID USERS ABOUT COMPROMISED PASSWORDS AND CHANGE PASSWORDS AUTOMATICALLY KNOW HOW SS
Google: గూగుల్ నుంచి అద్భుతమైన ఫీచర్... ఇక మీ పాస్వర్డ్ లీక్ అయ్యే ఛాన్స్ తక్కువ
Google: గూగుల్ నుంచి అద్భుతమైన ఫీచర్... ఇక మీ పాస్వర్డ్ లీక్ అయ్యే ఛాన్స్ తక్కువ
(ప్రతీకాత్మక చిత్రం)
Google | మీ అకౌంట్ పాస్వర్డ్ లీక్ అయిందని మీకు డౌట్‌గా ఉందా? ఇకపై మీ పాస్వర్డ్ లీక్ అయితే గూగుల్ అసిస్టెంట్ (Google Assistant) గుర్తించి ఆటోమెటిక్‌గా ఆ పాస్‌వర్డ్‌ని మార్చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రూపొందించింది గూగుల్.
గూగుల్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేసింది. ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసి, వాటికి పాస్వర్డ్స్ పెట్టుకునేవారిలో ప్రధానంగా ఉండే భయం తమ పాస్వర్డ్ లీక్ అవుతుందేమోనని. ఈ సమస్య దాదాపు అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. పాస్వర్డ్ లీక్ (Password Leak) అయితే హ్యాకర్లు సులువుగా ఆ అకౌంట్లో లాగిన్ అవుతారు. అకౌంట్ పాస్వర్డ్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందంటే యూజర్లకు అది పెద్ద రిస్కే. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం ద్వారా ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు. అయినా కొంత రిస్క్ తప్పదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గూగుల్ మరో అద్భుతమైన ఫీచర్‌ను (Google Feature) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందిస్తోంది. యూజర్ల పాస్వర్డ్ ఆన్లైన్లో లీక్ అయినట్టైతే గూగుల్ అసిస్టెంట్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు... పాస్‌వర్డ్‌ను ఆటోమెటిక్‌గా మార్చేస్తుంది.
వాస్తవానికి ఈ ఫీచర్‌ను గూగుల్ గతేడాదే ప్రకటించింది. ఆండ్రాయిడ్ యూజర్లకు క్రోమ్‌లో ఈ ఫీచర్ ఉంది. యూజర్ల అకౌంట్లకు సంబంధించిన ఏదైనా పాస్వర్డ్ లీక్ అయినట్టైతే వెంటనే గూగుల్ అసిస్టెంట్ యూజర్లకు 'Change Your Password Now' అని నోటిఫికేషన్ ద్వారా సమాచారం ఇస్తుంది. అందులోనే గూగుల్ అసిస్టెంట్ నుంచి 'Change Automatically' అని ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మీ అకౌంట్ పాస్వర్డ్ ఆటోమెటిక్‌గా మారిపోతుంది. లేదా మ్యాన్యువల్‌గా కూడా పాస్వర్డ్ మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. ఆటోమెటిక్‌గా పాస్వర్డ్ అప్డేట్ చేసే ఆప్షన్ కొన్ని వెబ్సైట్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ వచ్చాక యూజర్లు తమ పాస్‌వర్డ్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు... ఇప్పటికే మీరు క్రోమ్‌లో స్టోర్ చేసిన పాస్‌వర్డ్స్‌లో వీక్ పాస్వర్డ్స్ ఉన్నట్టైతే వాటి గురించి క్రోమ్ హెచ్చరిస్తుంది. మీ పాస్వర్డ్స్ ఒకసారి చెక్ చేసి వీక్‌గా ఉన్న పాస్వర్డ్స్ మార్చుకోవచ్చు.
మీ పాస్వర్డ్ మేనేజ్ చేయడానికి, స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఉపయోగించుకోవచ్చు. గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ మీ పాస్‌వర్డ్స్‌పై నిఘా పెట్టి, అందులో లీకైన పాస్‌వర్డ్స్‌ని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీంతో పాటు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ని సూచిస్తుంది. యూజర్లు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటే మీ అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశాలు తక్కువ.
మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, బండి నెంబర్ లాంటి వివరాలతో పాస్‌వర్డ్‌గా పెట్టకూడదు. 111111, 222222, 333333... లాంటి ఈజీ పాస్వర్డ్స్ అస్సలు పెట్టొద్దు. పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. పాస్‌వర్డ్‌లో అక్షరాలు, నెంబర్లతో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ తప్పనిసరి. అప్పర్ కేస్, లోయర్ కేస్ కాంబినేషన్‌తో పాస్వర్డ్ సెట్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.