హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Maps: గూగుల్ అదిరే కొత్త ఫీచర్.. టోల్ రేట్లను ముందుగానే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

Google Maps: గూగుల్ అదిరే కొత్త ఫీచర్.. టోల్ రేట్లను ముందుగానే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

గూగుల్ మ్యాప్స్‌తో టోల్ రేట్లు తెలుసుకోండిలా

గూగుల్ మ్యాప్స్‌తో టోల్ రేట్లు తెలుసుకోండిలా

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (google) యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. త్వరలోనే ‘టోల్ ఛార్జెస్ ఎస్టిమేషన్’ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫీచర్‌ను గూగుల్ రోలవుట్ చేసింది.

ఇంకా చదవండి ...

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. త్వరలోనే ‘టోల్ ఛార్జెస్ ఎస్టిమేషన్’ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫీచర్‌ను గూగుల్ రోలవుట్ చేసింది. ప్రయాణికులు గమ్యం చేరుకోవడానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని ఎంచుకునే ముందు.. టోల్ రేట్లను ఆదా చేయడం కోసం గూగుల్ సమాచారం అందిస్తుంది. ఇలా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఫీచర్ యూజర్లకు సహాయపడుతుంది.

అమెరికా, భారతదేశం, ఇండోనేషియాతో సహా ఎంపిక చేసిన దేశాల్లో దాదాపు 2,000 రూట్లలలో ఈ ఫీచర్‌ను గూగుల్ రోల్ చేయడం ప్రారంభించింది. దీన్ని రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ‘టోల్ రోడ్లు, సాధారణ రోడ్లలో సెలక్షన్‌ను సులభతరం చేయడంలో సహాయపడటానికి, మొదటిసారి గూగుల్ మ్యాప్స్‌లో టోల్ ధరలను విడుదల చేస్తున్నాం. మీరు నావిగేట్ చేయడాన్ని ప్రారంభించే ముందు గమ్యస్థానానికి చేరుకోవడం కోసం ఎస్టిమేట్ టోల్ ధర మీకు గూగుల్ మ్యాప్‌లో కనిపిస్తుంది. టోల్ పాస్ ఉందా లేదా, వారంలో ఏ రోజు, మీరు టోల్ ప్లాజా క్రాస్ చేసే నిర్దిష్ట సమయంలో టోల్ ఎంత ఖర్చు అవుతుంది వంటి వివరాలు తెలియజేసే సమాచారాన్ని అందిస్తాం.’ అని గూగుల్ మ్యాప్స్ టీమ్ వెల్లడించింది.

టోల్ ధరలను తెలుసుకోండిలా..

టోల్ ధరల ఫీచర్లను ప్రారంభించడానికి యూజర్లు గూగుల్ మ్యాప్స్ యాప్ డీప్ సెట్టింగ్‌లలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా గూగుల్ మ్యాప్స్‌లో ఆరిజిన్, డెస్టినేషన్‌ వివరాలు ఎంటర్ చేయండి. వెంటనే సంబంధిత రహదారికి సంబంధించిన ఎస్టిమేట్ టోల్ ధరలతో పాటు ఆ రూట్‌కు సంబంధించిన షార్ట్‌కట్స్, తక్కువ ట్రాఫిక్ ఉండే మార్గాలను యాప్ డిస్‌ప్లే చేస్తుంది. అలాగే ఆ రూట్‌లో ఉన్న అన్ని టోల్ బూత్‌ల ధరలను చూపుతుంది. ఈ ఫీచర్ ఇప్పటికే కర్ణాటక (భారతదేశం)లో చాలా రోడ్లపై డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంది.

గూగుల్ అదిరిపోయే గుడ్ న్యూస్.. మహిళల కోసం స్పెషల్ ప్రోగ్రామ్ లాంచ్


అలాగే గూగుల్ మ్యాప్‌లో కిందకు స్క్రోల్ చేస్తే ‘Remember Settings' ట్యాబ్‌తో పాటు ఆన్ /ఆఫ్, ‘Avoid Highways’ , ‘Avoid Tolls’, ‘Avoid Ferries’, ‘See toll pass prices’ అనే టోల్ సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి.

టోల్ లేని రూట్స్ కోసం ఇలా చేయాల్సి ఉంటుంది. గూగుల్‌ మ్యాప్స్‌లోకి వెళ్లి పైభాగంలో కుడివైపున ఉన్న త్రీ డాట్స్‌ మెనూ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో రూట్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకొని ‘అవైడ్‌ టోల్స్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ వేరే లెవల్ ఐడియా.. రియల్ లైఫ్ స్క్విడ్‌ గేమ్ ప్లాన్.. ప్రైజ్‌మనీ తెలిస్తే షాక్ అవుతారు..!


గూగుల్ మ్యాప్స్‌ ద్వారా మెరుగైన నావిగేషన్‌ను ఐఫోన్, యాపిల్‌ వాచ్ యూజర్లకు గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మ్యాప్స్‌లో యాపిల్‌ ఇకోసిస్టమ్‌ యూజర్‌ ట్రిప్‌లకు సంబంధించి ప్రత్యేక విడ్జెట్‌ను యాపిల్‌ వాచ్‌ నుంచి చూపిస్తుంది. సిరి వాయిస్‌ అసిస్టెంట్ సాయంతో డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్స్‌ నావిగేషన్‌ను పొందే అవకాశం యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. యాపిల్‌ వాచ్‌ యూజర్లు ఇకపై ఐఫోన్‌ ఉపయోగించకుండా నేరుగా వాచ్‌లోనే గూగుల్‌ మ్యాప్స్ నావిగేషన్స్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. తమ వాచ్‌కి ‘టేక్‌ మీ హోమ్‌’ కాంప్లికేషన్‌ను గూగుల్ మ్యాప్స్‌లో నావిగేట్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.

First published:

Tags: Google, Google Maps, Google search, Toll plaza

ఉత్తమ కథలు