TikTok Ban: టిక్ టాక్ ఫ్యాన్స్‌కు షాక్... ప్లేస్టోర్‌లో మాయమైన యాప్

TikTok Ban | ఇప్పటికే ఈ యాప్ ఉపయోగిస్తున్నవారికి ఇబ్బంది లేదు. యాప్ ఓపెన్ అవుతోంది. వీడియోలు కనిపిస్తున్నాయి. కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారికి సాధ్యం కాదు.

news18-telugu
Updated: April 17, 2019, 10:02 AM IST
TikTok Ban: టిక్ టాక్ ఫ్యాన్స్‌కు షాక్... ప్లేస్టోర్‌లో మాయమైన యాప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్ టాక్ యూజర్లకు, ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ మాయమైంది. టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలని వారం క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం... టిక్ టాక్ యాప్ తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్‌ సంస్థల్ని కోరడం లాంటి పరిణామాలతో యాప్ స్టోర్ నుంచి ఈ చైనీస్ వీడియో షేరింగ్ యాప్ మాయమైంది. ఇక ఎవరూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేరు. ప్లేస్టోర్‌లో సెర్చ్ చేస్తే టిక్ టాక్ యాప్ కనిపించట్లేదు. అయితే ఇప్పటికే ఈ యాప్ ఉపయోగిస్తున్నవారికి ఇబ్బంది లేదు. యాప్ ఓపెన్ అవుతోంది. వీడియోలు కనిపిస్తున్నాయి. కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునేవారికి సాధ్యం కాదు.

 

Read this: RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ

tiktok download ban, tik tok banned in india, TikTok banned in playstore, TikTok banned in appstore, TikTok Banned, గూగుల్ టిక్ టాక్ నిషేధం, గూగుల్ టిక్ టాక్ బ్యాన్, టిక్ టాక్ బ్యాన్ యాప్ స్టోర్, బ్యాన్ టిక్ టాక్, టిక్ టాక్ సేఫ్టీ, టిక్ టాక్ యాప్ వీడియో, టిక్ టాక్ స్టేటస్
ప్రతీకాత్మక చిత్రం


టిక్ టాక్... వీడియో షేరింగ్ యాప్. యువతీయువకుల్లో ఈ యాప్‌కు క్రేజ్ ఎక్కువ. సొంతగా వీడియోలు రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యాప్ ఎక్కువగా ఉపయోగిస్తుండటం విశేషం. అయితే ఈ సరదా కాస్తా వ్యసనంగా మారింది. దీంతో చైనాకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని కొద్దిరోజుల క్రితం మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్ట్ "పిల్లలు అపరిచితుల్ని నేరుగా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరం. పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా ఉంది" అని వ్యాఖ్యానించింది. టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని, డౌన్‌లోడ్స్‌ను నిషేధించాలని, టిక్‌టాక్ వీడియోలు మీడియా ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో చర్యలు మొదలుపెట్టిన ప్రభుత్వం... యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్‌ను తొలగించాలని మంగళవారం గూగుల్, యాపిల్‌ను కోరింది.

మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో టిక్ టాక్ డెవలపర్లు కూడా స్పందించారు. ఇప్పటివరకు 60 లక్షల వీడియోలను తొలగించారు. మరోవైపు టిక్ టాక్ యాప్‌ నిషేధం వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఏప్రిల్ 22న విచారణ జరగనుంది.

Photos: అమితాబ్ బచ్చన్ కొన్న కొత్త వాహనం ఇదే... ఫోటోలు చూడండి
ఇవి కూడా చదవండి:

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 70 ట్రైనీ ఉద్యోగాలు

JIO 251 Plan: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్

SBI Account: కేవైసీ లేకపోయినా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా...
First published: April 17, 2019, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading