GOOGLE ALERT FOR CHROME USERS HERE HOW TO PREVENT YOUR DATA FROM BEING LEAKED EVK
Google: క్రోమ్ యూజర్లకు అలర్ట్.. మీ డేటా లీక్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!
(ప్రతీకాత్మక చిత్రం)
Google Chrome | ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక అంశాలను జోడిస్తూ యూజర్ల భద్రతకు గూగుల్ పెద్ద పీట వేస్తుంది. తాజాగా క్రోమ్‌కు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొంది.. క్రోమ్ సెక్యూరిటీపై కొత్త ఫీచర్స్ తెలుసుకోండి.
ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక అంశాలను జోడిస్తూ యూజర్ల భద్రతకు గూగుల్ పెద్ద పీట వేస్తుంది. తాజాగా క్రోమ్‌కు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొంది. . ఇంటర్నెట్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ (Google Chrome) ఎంతగా పాపులర్ (Popular) అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్(Android), విండోస్‌తో(Windows) సహా ఇతర ఓఎస్ యూజర్లు కూడా యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు గూగుల్ క్రోమ్(Google Chrome) యూజర్లకు భారీ స్థాయి ముప్పు పొంచి ఉందని తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది. ఈ సైబర్ క్రైమ్ నోడల్ ఏజెన్సీ డెస్క్‌టాప్ క్రోమ్ బ్రౌజర్ (Desktop Chrome Browser)లో కొన్ని ప్రధాన సాంకేతిక బలహీనతలను (Technical Vulnerabilities) హైలైట్ చేసింది. ఈ టెక్నికల్ వీక్నెసెస్‌ని హ్యాకర్లు ఈజీగా యూజ్ చేసుకొని యూజర్లపై సైబర్ అట్టాక్ చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే సీఈఆర్టీ-ఇన్ (CERT-In) క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలని యూజర్లకు కోరుతోంది. ఈ టెక్నికల్ వీక్నెసెస్‌ని గూగుల్ ఇప్పటికే గుర్తించి వాటిని లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఫిక్స్ చేసింది.
క్రోమ్ బ్రౌజర్‌లో ఉన్న సమస్య ఏంటి?
101.0.4951.41కి ముందు ఉన్న గూగుల్ క్రోమ్ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లోని కొత్త సాంకేతిక లోపం ఉంది. దీనివల్ల డెస్క్‌టాప్ యూజర్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ లోపాన్ని గూగుల్ గుర్తించిన తర్వాత క్రోమ్ బ్లాగ్ పోస్ట్‌లో 30 లోపాలను లిస్ట్ చేసింది. ఇందులో దాదాపు ఏడు లోపాలు కారణంగా యూజర్లకు అధిక ముప్పు ఉందని గూగుల్ వెల్లడించింది. ఈ లోపాల వల్ల రిమోట్ అటాకర్లు యూజర్ల సిస్టమ్‌లో కోడ్‌ని అమలు చేసి.. సున్నితమైన సమాచారానికి యాక్సెస్ చేయడం సాధ్యమవుతుందని CERT-In వివరించింది. ఈ లోపం సెక్యూరిటీ పరిమితులు దాటవేయడానికి హ్యాకర్లకు మార్గం సుగమం చేస్తుంది. అలాగే యూజర్ల సిస్టమ్‌పై బఫర్ ఓవర్‌ఫ్లోకి కారణమయ్యేలా అనుమతిస్తుంది.
సైబర్ క్రైమ్ నోడల్ ఏజెన్సీ ప్రకారం, “Vulkan, SwiftShader, ANGLE, డివైజ్ ఏపీఐ, Sharin సిస్టమ్ ఏపీఐ, ఓజోన్, బ్రౌజర్ స్విచర్, బుక్ మార్క్స్, దేవ్ టూల్స్ ఇన్‌పుట్, HTML పార్సర్, వెబ్ GPU లో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో, యూఐ షెల్ఫ్‌కు మెమరీ యాక్సెస్, బ్లింక్ ఎడిటింగ్ వంటివి ఉపయోగిస్తే దాడులు చేసేవారికి లక్ష్యం అయ్యే ప్రమాదం ఎక్కువ. ఈ కారణంగా మీ బ్రౌజర్‌ని వెంటనే వెర్షన్ 101.0.4951.41కి అప్‌గ్రేడ్ చేయండి. విండోస్, మ్యాక్, అలాగే Linux యూజర్లు తమ పర్సనల్ డేటా లీక్ అవ్వకుండా ఉండాలంటే త్వరగా కొత్త వర్షన్ అప్‌డేట్ చేసుకోవడం మంచిది. గూగుల్ విండోస్ , మ్యాక్, లైనెక్స్ (Linux) కోసం అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ అప్‌డేట్ రాబోయే రోజులు లేదా వారాల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.
స్టెప్ 1: క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: డ్రాప్ డౌన్ మెనూలో, సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: హెల్ప్‌పై క్లిక్ చేసి ఆపై అబౌట్ గూగుల్ క్రోమ్ (About Google Chrome) ఆప్షన్‌పై నొక్కండి
స్టెప్ 4: పెండింగ్‌లో ఉన్న ఏదైనా అప్‌డేట్‌ని క్రోమ్ ఇప్పుడు డౌన్‌లోడ్ చేస్తుంది.
అప్‌డేట్ ఇన్‌స్టాల్ అయ్యాక క్రోమ్ షట్ డౌన్ చేసి మళ్లీ రీస్టార్ట్ అవుతుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.