గూగుల్ AI... కళ్లను చూసి మీకొచ్చిన రోగమేంటో చెప్పేస్తుంది...

డయాబెటిక్ రెటినోపతిని గుర్తించేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన గూగుల్... త్వరలో దేశంలోని క్లినిక్స్‌లో అందుబాటులోకి!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 9, 2019, 11:41 PM IST
గూగుల్ AI... కళ్లను చూసి మీకొచ్చిన రోగమేంటో చెప్పేస్తుంది...
నమూనా చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ gilaxia / Istock.com)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 9, 2019, 11:41 PM IST
సరికొత్త ఆవిష్కరణలను రూపొందిస్తూ... టెక్ రంగంలో దూసుకుపోతున్న సెర్చ్ ఇంజన్ దిగ్గజం ‘గూగుల్’... మరో సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. మనిషి కంటిని చూసి... అతనికొచ్చిన రోగం ఎంటో పక్కాగా లెక్కకట్టిచెప్పేలా ఓ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌కు శ్రీకారం చుట్టింది గూగుల్. ముఖ్యంగా మెజారిటీ మందిని బాధపెడుతున్న డయాబెటిక్ రోగాన్ని అతి తేలికగా గుర్తించేందుకు వీలుగా... ‘డయాబెటిక్ రెటినోపతి ఏఐ’ని ఆవిష్కరించే పనిలో బిజీగా ఉంది గూగుల్. మనిషి కళ్లను చూసి... కంటి వైద్యుల కంటే పక్కాగా.... కచ్చితంగా షుగర్ స్థాయిని లెక్కకట్టి చెప్పేస్తుందీ గూగుల్ ఏఐ.

త్వరలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాబెటిక్ రెటినోపతీ ఆవిష్కరణాన్ని భారతదేశంలోని క్లినిక్స్‌కు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు గూగుల్ పెద్దలు తెలిపారు. ప్రపంచంలో దాదాపు 40 కోట్ల మంది డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో మూడొంతుల మందికి ‘డయాబెటిక్ రెటినోపతి’ సమస్య ఉంది. ఈ సమస్య ఉన్నవారిలో కొద్దికొద్దిగా చూపు తగ్గిపోయి... కొంతకాలానికి పూర్తిగా చూపు కోల్పోతారు. గూగుల్ ఏఐ కారణంగా డయాబెటిక్ రెటినోపతిని తేలిగ్గా, త్వరగా గుర్తించేందుకు అవకాశం ఉంది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మందికి వైద్య సేవలు అందించేందుకు అవకాశం పెరుగుతుంది. పూర్తిగా చూపు కోల్పోకముందే కాపాడేందుకు ఛాన్స్ దొరుకుతుంది. ‘డయాబెటిక్ రెటినోపతి’ సమస్యను గుర్తించగలిగే ఐ కేర్ స్పెషలిస్ట్‌లు చాలా తక్కువగా ఉండడంతో ఈ ‘గూగుల్ ఏఐ’ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు.

First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...