మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేయబోతోంది గూగుల్. గూగుల్ I/O 2021 ఈవెంట్లో ఈ కొత్త ఫీచర్స్‌ని ప్రకటించింది. ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలను గూగుల్ సీరియస్‌గా తీసుకుంటున్నట్టు గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో రాబోయే కొత్త ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్స్‌ని ప్రకటించారు. ఆండ్రాయిడ్ 12 యూజర్ ఇంటర్ఫేస్లో కూడా భారీగా మార్పులు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12 లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఫీచర్స్ ఏంటో, మీకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.
Privacy Dashboard: ఆండ్రాయిడ్ 12 లో కొత్తగా ప్రైవసీ డ్యాష్‌బోర్డ్ కనిపించబోతోంది. ఇందులో మీరు యాప్స్‌కు ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చారో తెలుసుకోవచ్చు. యాప్స్‌కి పర్మిషన్స్ కూడా తొలగించొచ్చు.
Password Manager: గూగుల్ ఇప్పటికే పాస్వర్డ్ మేనేజర్ ఫీచర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై థర్డ్ పార్టీ మేనేజర్ నుంచి మీ పాస్‌వర్డ్స్‌ని సులువుగా గూగుల్ పాస్వర్డ్ మేనేజర్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
Indicator Alert: ఏదైనా యాప్ మీ కెమెరా లేదా మైక్రోఫోన్ ఉపయోగిస్తున్నట్టైతే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లో టాప్‌లో చిన్న డాట్‌తో మీకు అలర్ట్ కనిపిస్తుంది. ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్స్ ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ అధికారికంగా ఈ ఫీచర్ అందించనుంది.
Folder Lock: మీరు గూగుల్ ఫోటోస్ యాప్ ఉపయోగిస్తున్నారా? ఇక ఈ యాప్‌లోని ఫోల్డర్లను పాస్‌వర్డ్‌తో లాక్ చేయొచ్చు. మీరు పర్సనల్‌గా భావించే ఫోటోలను ఆ ఫోల్డర్లో దాచుకోవచ్చు.
Browsing History: మీరు సెర్చ్ చేసే ప్రతీ పదం, ప్రతీ వెబ్సైట్ రికార్డ్ అయి ఉంటుంది. దాన్నే బ్రౌజింగ్ హిస్టరీ అంటారు. మీరు కేవలం ఒక్క బటన్ క్లిక్ చేసి గత 15 నిమిషాల్లో గూగుల్‌లో మీ యాక్టివిటీకి సంబంధించిన డేటాను డిలిట్ చేయొచ్చు.
Location History: గూగుల్ లొకేషన్ సెర్చ్ హిస్టరీని ఇక మీరు సులువుగా ఆఫ్ చేయొచ్చు. గూగుల్ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోకుండా, మీరు వద్దనుకున్నప్పుడు లొకేషన్ ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్ కూడా మీ లొకేషన్‌ను ట్రాక్ చేయలేవు.
Location Sharing: మీరు ఎవరికైనా అడ్రస్ చెప్పాలనుకుంటే ఖచ్చితమైన లొకేషన్ షేర్ చేయాల్సి ఉంటుంది. కానీ యాప్స్ లొకేషన్ ట్రాక్ చేసేప్పుడు ఖచ్చితమైన లొకేషన్ షేర్ చేయాల్సి అవసరంలేదు. అందుకే అప్రాక్సిమేట్ లొకేషన్ ఫీచర్ తీసుకొస్తోంది గూగుల్.
Battery: ఆండ్రాయిడ్ 12 కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత మీ బ్యాటరీ చాలావరకు ఆదా అవుతుంది. సీపీయూ టైమ్ 22 శాతం, సిస్టమ్ సర్వర్ 15 శాతం తగ్గుతుందని గూగుల్ ప్రకటించింది.
Remote App: ఆండ్రాయిడ్ 12 అప్డేట్లో మీకు రిమోట్ యాప్ కూడా రానుంది. దీంతో మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే మీ టీవీని ఆపరేట్ చేయొచ్చు.
Wi-Fi sharing: మీ వైఫై కనెక్షన్‌ను ఇతరులకు షేర్ చేయాలనుకుంటున్నారా? నియర్‌బై బటన్ ద్వారా క్యూఆర్ కోడ్ షేర్ చేసి మీ వైఫై కనెక్షన్ షేర్ చేయొచ్చు.
One-handed mode: మీరు పెద్ద స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా? అయితే వన్ హ్యాండెడ్ మోడ్ రాబోతోంది. ఒక చేత్తో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
Material You: మెటీరియల్ యూ పేరుతో యూజర్ ఇంటర్ఫేస్ను పూర్తిగా మార్చబోతోంది గూగుల్. యానిమేషన్స్, టైల్ డిజైన్స్, కలర్ ఆప్షన్స్ అన్నీ కొత్తగా కనిపిసతాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.