ఇంటర్నెట్‌లో ఉండే సమాచారం అంతా సురక్షితం కాదు. ఏ వెబ్‌సైట్ మాటున ఏ మాల్ వేర్ ఉందో, ఏ ఎక్స్‌టెన్షన్ వెనుక ఏ వైరస్ ఉందో, ఏ ఇమేజ్ కోడింగ్ ఏ యాడ్ వేర్ ఉందో ఎవరికీ తెలియడం లేదు. దీంతో యూజర్లకు మెరుగైన రక్షణ ఇచ్చేలా బ్రౌజర్లు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా గూగుల్ క్రోమ్ తన వెబ్ బ్రౌజర్‌లో చాలా మార్పులు చేసింది. దీంతో క్రోమ్‌లో బ్రౌజింగ్ ఇప్పుడు చాలా సురక్షితం అని చెబుతోంది గూగుల్. క్రోమ్ బ్రౌజర్‌లో అదనపు సౌకర్యాల కోసం ఎక్స్‌టెన్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇవి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ లాగా పనిచేస్తాయి. ఇప్పటికే చాలామంది వీటిని డౌన్‌లోడ్ చేసుంటారు. ప్రతిసారి సంబంధిత వెబ్‌సైట్‌కి వెళ్లి ఆ పని చేయకుండా ... ఎక్స్‌టెన్షన్‌తో పని పూర్తి చేయవచ్చు. అయితే హ్యాకర్లు వీటిని ఆసరాగా తీసుకొని సిస్టమ్స్‌లోకి వైరస్, మాల్‌వేర్‌లు పంపిస్తున్నారు. అందుకే క్రోమ్ తాజాగా తీసుకొస్తున్న 91 అప్‌డేట్‌లో మార్పులు చేసింది. ఏదైనా ఇబ్బందికరమైన ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేస్తుంటే... క్రోమ్ యూజర్‌ను అలర్ట్ చేస్తుంది.
Realme 5G Phone: రియల్‌మీ మరో సంచలనం... రూ.7,000 ధరకే 5జీ ఫోన్
Realme Anniversary Sale: రియల్‌మీ సేల్‌లో ఈ 28 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్
బ్రౌజర్‌లో Enhanced Safe Browsing అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే... యూజర్ డౌన్‌లోడ్ చేసే ప్రతి ఫైల్ విషయంలోనూ బ్రౌజర్ జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ముందుగా చెప్పినట్లు ఇబ్బందికర ఎక్స్‌టెన్షన్ అయితే అలర్ట్ ఇస్తుంది. ఈ రెండు ఫీచర్లున్న గూగుల్ క్రోమ్ 91 వెర్షన్ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్లు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారని తెలుస్తోంది.
అప్పటివరకు ఈ తరహా ఫీచర్‌ను వాడుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్‌లో సేఫ్ బ్రౌజింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే డేంజరస్ ఫైల్స్ ఏవైనా బ్రౌజర్‌లో డౌన్‌లోడ్ చేస్తుంటే సూచిస్తుంది. అయితే దీనికి మించిన ఆప్షన్లతో ఎన్‌హ్యాన్స్‌డ్ సేప్ బ్రౌజింగ్ ఫీచర్ ఉండబోతోంది. పాస్‌వర్డ్స్ ఎక్స్‌పోజ్ అయ్యే పరిస్థితి వచ్చినా ఈ ఆప్షన్ అలర్ట్ చేస్తుందట. యూఆర్‌ఎల్స్‌ను అనలైజ్ చేసి ఆ పేజీతో గతంలో ఏమైవా సమస్యలు వచ్చాయా అనేది కూడా సేఫ్ బ్రౌజింగ్‌లో తెలుసుకోవచ్చు.
Card Transactions: ఆన్‌లైన్ షాపింగ్‌కు మీ కార్డు పనిచేయట్లేదా? అకౌంట్‌లో ఈ సెట్టింగ్స్ మార్చండి
Amazon Offer: కొత్త ఫోన్ కొన్నారా? అమెజాన్ నుంచి రూ.399 ధరకే ఈ ఆఫర్
ముందు క్రోమ్ బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే సేఫ్ బ్రౌజింగ్ అనే సెక్షన్‌లో ఎన్ హ్యాన్స్‌డ్ ప్రొటక్షన్ అని ఉంటుంది. దాన్ని యాక్టివ్ చేసుకుంటే సరి. లేదంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి పైన సెర్చ్‌లో ఎన్‌హ్యాన్స్‌డ్ ప్రొటక్షన్ అని సెర్చ్ చేయాలి. ఆ తర్వాత ఎనేబుల్ చేసుకోవడమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google news