Home /News /technology /

GOOGLE ADDS NEW FEATURE TO LIVE STREAM ON GOOGLE MEET KNOW HOW IT WORKS SS GH

Google Meet: గూగుల్‌ మీట్‌లో సూపర్‌ ఫీచర్‌.... ఇక లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా ఇచ్చుకోవచ్చు

Google Meet: గూగుల్‌ మీట్‌లో సూపర్‌ ఫీచర్‌.... ఇక లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా ఇచ్చుకోవచ్చు

Google Meet: గూగుల్‌ మీట్‌లో సూపర్‌ ఫీచర్‌.... ఇక లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా ఇచ్చుకోవచ్చు

Google Meet | వీడియో మీటింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం గూగుల్ మీట్ యాప్ వాడుతున్నారా? లైవ్ స్ట్రీమింగ్ కోసం కొత్త ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

పోటీ యాప్‌లు, సర్వీసులకు దీటుగా సేవలు అందించడానికి గూగుల్‌ ప్రయత్నిస్తోంది. తాజాగా తన ‘గూగుల్‌ మీట్‌’లో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో క్రాస్‌ డొమైన్‌ లైవ్‌ స్ట్రీమ్‌ ఒకటి కాగా, రెండోది క్యాప్షన్స్‌. ఈ ఫీచర్లు ప్రస్తుతం గూగుల్‌ వర్క్‌ స్పేస్‌ స్టాండర్డ్‌, ఎంటర్‌ప్రైజ్‌ ప్లస్‌, టీచింగ్‌ అండ్ లెర్నింగ్‌ అప్‌గ్రేడ్‌, ఎడ్యుకేషన్‌ ప్లాన్స్‌ ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆప్షన్లు ఎలా పని చేస్తాయి, యూజర్లకు ఎలా ఉపయుక్తంగా ఉంటాయనేది చూద్దాం.

గూగుల్‌ మీట్‌ను వాడుతున్నప్పుడు ఆ మొత్తం వీడియో ఫుటేజ్‌ లైవ్‌ స్ట్రీమ్‌ను చేస్తే ఇకపై ఎవరైనా చూడొచ్చు. గతంలో అయితే కేవలం గూగుల్‌ మీట్‌లో కాల్‌/కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నప్పుడు సొంత ఆర్గనైజేషన్‌కి సంబంధించిన గెస్ట్‌లు మాత్రమే చూడగలిగేవాళ్లు. అయితే ఇప్పుడు అడ్మిన్స్‌ ట్రస్ట్‌ చేసిన గెస్ట్‌లు (వాళ్లు ఇతర ఆర్గనైజేషన్‌కి చెందినవారైనా) కూడా చూడొచ్చట. ఈ మేరకు గూగుల్‌ తన బ్లాగ్‌లో వివరించింది. అలా అని అన్నిరకాల డొమైన్లను యాక్సెప్ట్ చేయొద్దని గూగుల్‌ కోరుతోంది.

Mi 11 Ultra 5G: ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ సేల్... ఎస్‌బీఐ కార్డుతో రూ.5000 డిస్కౌంట్

Airtel Black plan: ఎయిర్‌టెల్ నుంచి కొత్త సర్వీస్... ఒకే ప్లాన్‌పై మొబైల్, డీటీహెచ్, ఇంటర్నెట్ కనెక్షన్స్

లైవ్‌ స్ట్రీమింగ్‌ జరుగుతున్నప్పుడు ఆ మాటల్ని అప్పటికప్పుడు అక్షరాల రూపంలో ఇవ్వడానికి లైవ్‌ స్ట్రీమ్‌ క్యాప్షన్స్‌ అంటారు. ఈ ఆప్షన్‌ను గూగుల్‌ మీట్‌ కాల్స్‌/కాన్ఫరెన్స్‌లో కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు. దీని ద్వారా గూగుల్‌ మీట్‌ యూజ్‌ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా క్యాప్షన్స్‌ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, స్పానిస్‌, పోర్చుగీస్‌ భాషల్లో మాత్రమే ఈ లైవ్‌ క్యాప్షన్స్‌ ఆప్షన్ పని చేస్తోంది. చెవుడు, వినికిడి లోపం ఉన్నవారికి ఈ లైవ్‌ క్యాప్షన్స్‌ ఫీచర్‌ బాగా ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్‌ చెబుతోంది. చూడటం, వినడం కంటే... చదవడమే బాగుంటుంది అనుకునేవారికి కూడా ఈ ఆప్షన్‌ ఉపయుక్తంగా ఉంటుంది.

WhatsApp New Features: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఈ 5 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి

Android New Features: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ఈ 7 కొత్త ఫీచర్స్ మీకోసమే

గూగుల్‌ మీట్‌ సంగతి చూస్తే... ప్రస్తుతం ఈ సేవలను ఆన్‌బోర్డింగ్‌ ట్రైనింగ్‌, పెద్ద పెద్ద గ్రూపు ఎంప్లాయిస్‌ కోసం వినియోగిస్తున్నారట. ఒక్కో మీటింగ్‌లో గరిష్ఠంగా లక్ష మంది వినియోగదారులు ఉంటారని గూగుల్‌ చెబుతోంది. మరికొన్ని సందర్భాల్లో పది వేల మంది ఉన్న సందర్భాలూ ఉన్నాయి. ఇది ఆ సంస్థలు/డొమైన్లు తీసుకున్న ప్లాన్స్‌ బట్టి ఉంటుంది. ప్రస్తుతం గూగుల్‌ మీట్‌ను వెబ్‌, మొబైల్‌ డివైజ్‌లో వాడుకోవచ్చు. త్వరలో గూగుల్ మీట్‌లో మరికొన్ని ఆప్షన్లు తీసుకొస్తున్నారు. మరోవైపు గూగుల్‌కు సంబంధించి కీలక యాప్స్‌లో మీట్‌ను ఇంటిగ్రేట్‌ చేస్తోంది గూగుల్‌. జీమెయిల్‌లో ఇంటిగ్రేషన్‌ ఇప్పటికే పూర్తయింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Google, Google news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు