హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Android New Features: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 7 కొత్త ఆండ్రాయిడ్స్ ఫీచర్స్

Android New Features: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 7 కొత్త ఆండ్రాయిడ్స్ ఫీచర్స్

Android New Features: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 7 కొత్త ఆండ్రాయిడ్స్ ఫీచర్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Android New Features: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 7 కొత్త ఆండ్రాయిడ్స్ ఫీచర్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Android New Features | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో కొత్తగా 7 ఫీచర్స్ వచ్చాయి. ఆ ఫీచర్స్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. గూగుల్ ఒకేసారి 7 కొత్త ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎప్పటికప్పుడు గూగుల్ మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఫీచర్స్ రూపొందిస్తూ ఉంటుంది. వాటిని పరీక్షించిన తర్వాత విడుదల చేస్తుంది. ఇప్పుడు 7 ఆండ్రాయిడ్ ఫీచర్స్‌ని యూజర్లకు రిలీజ్ చేసింది. ఇందులో మెసేజెస్ యాప్, ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్, ఎమొజీస్‌ లాంటివాటిలో ఈ కొత్త ఫీచర్స్ ఉన్నాయి. మరి ఈ 7 ఫీచర్స్ మీకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.

end-to-end encryption: యూజర్లకు ప్రైవసీ కోసం వాట్సప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్స్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై గూగుల్ మెసేజెస్ యాప్‌లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఉంటుంది. గతేడాది నవంబర్‌లోనే బీటా వర్షన్ రిలీజ్ అయింది. ఇప్పుడు యూజర్లందరికీ ఈ ఫీచర్ అందిస్తోంది గూగుల్.

Airtel Rs 456 Plan: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.456 ప్లాన్ ప్రకటించిన కంపెనీ

Jio Plans: జియో ఫోన్ యూజర్లకు రూ.39 నుంచి 7 రీఛార్జ్ ప్లాన్స్

Starred messages: వాట్సప్‌లో మీకు నచ్చిన మెసేజ్‌ని స్టార్ మార్క్‌తో సేవ్ చేసుకుంటారా? గూగుల్ కూడా అదే ఫీచర్‌ను మెసేజెస్ యాప్‌లో అందిస్తోంది.

Earthquake alert system: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. గతంలో న్యూజిల్యాండ్, గ్రీస్ లాంటి దేశాల్లోనే ఈ ఫీచర్ ఉండేది. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోని యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తోంది.

Android Auto: కార్‌లో వెళ్తున్నప్పుడు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ ఉపయోగిస్తున్నారా? ఇకపై ఇందులోని ఫీచర్స్‌ని మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

WhatsApp: బీ రెడీ... వాట్సప్‌లో రాబోతున్న 5 కొత్త ఫీచర్స్ ఇవే

iQoo Z3 5G: రూ.19,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,490 ధరకే కొనండి ఇలా

emojis: మీరు వాట్సప్ మెసేజెస్ పంపేప్పుడు ఎమోజీస్ వాడుతుంటారా? జీబోర్డ్ యాప్‌లో కొత్త ఎమోజీస్ కనిపించనున్నాయి. అంతేకాదు ఎమోజీ కిచెన్ టూల్‌తో రెండు వేర్వేరు ఎమోజీలను కలిపి కొత్త ఎమోజీ తయారు చేయొచ్చు.

Favourite apps: ఇకపై మీ ఫేవరెట్ యాప్స్‌ని వాయిస్‌తో యాక్సెస్ చేయొచ్చు. మీరు ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే అందుకు సంబంధించిన యాప్ ఓపెన్ అవుతుంది.

Voice Access: మోటార్ డిసేబిలిటీస్ ఉన్నవారి కోసం రూపొందించిన ఫీచర్ ఇది. వాయిస్‌తో ఫోన్, యాప్‌ను నావిగేట్ చేయొచ్చు.

First published:

Tags: 5G Smartphone, Android, Android 10, Android 11, Android 12, Google, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones

ఉత్తమ కథలు