హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Account: మీ గూగుల్ అకౌంట్‌ను సూపర్ సేఫ్‌గా ఉంచుకోవాలా..? అయితే ఈ టిప్స్ పాటించండి..

Google Account: మీ గూగుల్ అకౌంట్‌ను సూపర్ సేఫ్‌గా ఉంచుకోవాలా..? అయితే ఈ టిప్స్ పాటించండి..

Google Account: మీ గూగుల్ అకౌంట్‌ను సూపర్ సేఫ్‌గా ఉంచుకోవాలా..? అయితే ఈ టిప్స్ పాటించండి..

Google Account: మీ గూగుల్ అకౌంట్‌ను సూపర్ సేఫ్‌గా ఉంచుకోవాలా..? అయితే ఈ టిప్స్ పాటించండి..

గూగుల్ అకౌంట్ ఇప్పుడు ప్రతి యూజర్‌కు కీలకంగా మారింది. ఇలాంటి ముఖ్యమైన అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవడం తప్పనిసరి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఇంటర్నెట్ యూజర్లు గూగుల్‌ (Google)కి సంబంధించి అనేక సేవలను పొందేందుకు గూగుల్ అకౌంట్ (Google Account) క్రియేట్ చేసుకుంటారు. ఈ అకౌంట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఒకే గూగుల్ అకౌంట్‌తో గూగుల్ యాప్స్‌లో లాగిన్ కావడం ఒకటి. నిజానికి యూజర్ల డిజిటల్ యాక్టివిటీకి(Digital Activity) సంబంధించి అత్యధిక డేటాను కలెక్ట్ చేయడంలో అన్నిటికంటే గూగుల్ అకౌంట్ ముందుంటుంది. గూగుల్ అకౌంట్‌కు(Google Account) అనేక యాప్‌లు, సర్వీసులు కూడా లింక్(Link) అవుతాయి. అలా గూగుల్ అకౌంట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇలాంటి ముఖ్యమైన అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవడం తప్పనిసరి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Teacher Eligibility Test: టెట్ లో అర్హత సాధించలేని వారికి గుడ్ న్యూస్.. వారి కోసం మరో అవకాశం ఇలా..

* సేఫ్ బ్రౌజింగ్‌ ఎనేబుల్ చేయాలి

సేఫ్ బ్రౌజింగ్ ఎనేబుల్ చేయడం వల్ల గూగుల్ హానికరమైన వెబ్‌సైట్లు, డౌన్‌లోడెడ్ ఫైల్స్‌, క్రోమ్, ఇతర యాప్‌లలో ఉపయోగించే ఎక్స్‌టెన్షన్స్‌ను యూజర్లు యాక్సెస్ చేయకుండా రక్షిస్తుంది. ఈ ఫీచర్ యూజర్‌ల పాస్‌వర్డ్‌ లీక్ అయ్యుంటే.. వారిని హెచ్చరిస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. గూగుల్ అనేది క్రోమ్ URLలను, గూగుల్ యాప్‌లను ఉపయోగిస్తూ యూజర్లు, వారి అకౌంట్‌కి హాని కలిగించే హానికరమైన యాక్టివిటీని గుర్తిస్తుంది.

* కొత్త అకౌంట్ సైన్-ఇన్ అలర్ట్స్

సాధారణంగా యూజర్లు అప్పుడప్పుడు వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల డివైజ్‌ల్లో వారి గూగుల్ అకౌంట్‌కి లాగిన్ అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో, గూగుల్ యూజర్లకు కొత్త సైన్-ఇన్ అలర్ట్ పంపుతుంది. వారు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, వారి గూగుల్ అకౌంట్‌కి ఎక్కడ లాగిన్‌ చేశారో చాలా డీటెయిల్డ్‌గా ట్రాక్ చేస్తుంది. ఏ మోడల్ డివైజ్‌లో ఏ టైమ్‌కు లాగిన్ అయ్యారో కూడా తెలుపుతుంది. ఈ మెకానిజం మీ గూగుల్ అకౌంట్‌లో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

* గూగుల్ సెక్యూరిటీ చెకప్

మీ గూగుల్ అకౌంట్ ఏయే డివైజ్‌లలో లాగిన్ అయి ఉందో చెక్ చేయడానికి గూగుల్ సెక్యూరిటీ చెకప్‌ను అందిస్తోంది. దీని సహాయంతో మీరు ఇకపై ఉపయోగంలో లేని వాటి నుంచి మీ అకౌంట్ రిమూవ్ చేసుకోవచ్చు. గూగుల్ అకౌంట్‌కి లాగిన్ చేయడానికి నెలలు లేదా సంవత్సరాల క్రితం ఏదైనా ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను ఉపయోగించి ఉంటే వాటికి మీ ఖాతాకు యాక్సెస్‌ను తీసివేయమని గూగుల్ అడుగుతుంది. సైన్-ఇన్, రికవరీ కోసం ఉపయోగించిన ఈ-మెయిల్ ఐడీని వెరిఫై చేసి ఈ డివైజ్‌ల నుంచి వాటిని రిమూవ్ చేయవచ్చు.

Telangana District Court Jobs 2022: గుడ్ న్యూస్.. జిల్లా కోర్టుల నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల..

* పాస్‌వర్డ్‌లను ట్రాక్ చేయాలి

ఈరోజుల్లో చాలా డిజిటల్ అకౌంట్స్ ఉండటం సహజం. వాటిలో ఏది సైబర్ అటాక్స్‌కి గురవుతుందో లేదా దేనికి ఎక్కువ అని ఉందో తెలుసుకోవడం కష్టం. ఇక పాస్‌వర్డ్‌లను ట్రాక్ చేయడం ఒక ఛాలెంజింగ్ టాస్క్‌గా అనిపిస్తుంది. సెక్యూరిటీ చెకప్‌తో, మీ పాస్‌వర్డ్‌లలో ఏవి డేటా బ్రీచ్స్‌కి ఎఫెక్ట్ అయ్యాయో మీరు తెలుసుకోవచ్చు. ఎక్స్‌పోజ్డ్‌ అకౌంట్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలని గూగుల్ యూజర్లకు సలహా కూడా ఇస్తుంది.

First published:

Tags: 5g technology, Google, Google accounts, Google Assistant

ఉత్తమ కథలు