Good News: ఇక పేటీఎంలో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు... కొత్త డీల్

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్‌లో స్విగ్గీ, ఊబెర్ ఈట్స్‌తో పోటీ ఎదుర్కొంటున్న జొమాటోకు పేటీఎంతో డీల్ కలిసొస్తుందనే భావిస్తున్నారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌లోకి కొత్త యూజర్లు వస్తారని అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: January 18, 2019, 6:15 PM IST
Good News: ఇక పేటీఎంలో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు... కొత్త డీల్
Good News: ఇక పేటీఎంలో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు... కొత్త డీల్
  • Share this:
రీఛార్జులు, సినిమా టికెట్లు, బిల్లులు, షాపింగ్ కోసం మీరు పేటీఎం యాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు మరో శుభవార్త. ఇక నుంచి మీరు పేటీఎంలో ఫుడ్ కూడా ఆర్డర్ చేయొచ్చు. ఇందుకోసం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకుంది పేటీఎం. మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం, జొమాటో యాప్స్ ఉపయోగిస్తున్నట్టైతే ఇక పేటీఎం యాప్ మాత్రం చాలు. జొమాటోలో ఉండే ఆఫర్లన్నీ పేటీఎంలో కనిపిస్తాయి. మీరు నేరుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి ఫుడ్ బుక్ చేస్తే జొమాటోలో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఈ మేరకు జొమాటో, పేటీఎం మధ్య ఒప్పందం కుదిరింది.

ఇది కూడా చదవండి: Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్‌లో స్విగ్గీ, ఊబెర్ ఈట్స్‌తో పోటీ ఎదుర్కొంటున్న జొమాటోకు పేటీఎంతో డీల్ కలిసొస్తుందనే భావిస్తున్నారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌లోకి కొత్త యూజర్లు వస్తారని అంచనా వేస్తున్నారు. 120 నగరాల్లో 80,000 రెస్టారెంట్లతో జొమాటో సేవలు అందిస్తోంది. నెలకు 2.8 కోట్ల ఆర్డర్లు డెలివరీ చేస్తోంది. పేటీఎంకు టైర్-2, టైర్-3 నగరాల్లో యూజర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ సర్వీస్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారతదేశంలోని మిగతా యూజర్లకు, ఐఓఎస్ యాప్‌లో సేవలు మొదలౌతాయి.


ఇవి కూడా చదవండి:

PF BALANCE: మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 5 మార్గాలు

ఈ యూజర్లు ఇక IRCTC ఉపయోగించుకోలేరు... ఎందుకో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: January 18, 2019, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading