• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • GOOD NEWS WHATSAPP USERS CAN SET PASSWORD FOR CHAT BACKUP SOON KNOW HOW IT WORKS SS

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp New Features | వాట్సప్‌లో మరిన్ని కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఛాట్ బ్యాకప్స్‌కి కూడా పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

  • Share this:
    వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందించబోతోంది. వాట్సప్‌లోని మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు. మీ ఛాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్‌వర్డ్ సెట్ చేయాలి. మళ్లీ మీరు ఆ ఛాట్స్ రీస్టోరే చేయాలనుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నట్టు WABetaInfo సమాచారం ఇచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని కూడా షేర్ చేసింది. వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌కి ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సప్. పాస్‌వర్డ్ సెట్ చేస్తే ఆ ఛాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి.

    వాట్సప్ ఛాట్స్ బ్యాకప్‌కి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు బీటా యూజర్ అయితే మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. బీటా యూజర్లు విజయవంతంగా పరీక్షించిన తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

    WhatsApp: వాట్సప్‌లో ఈ 7 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి... ఎలా వాడుకోవచ్చంటే

    Exchange Offer: మీ పాత ఫోన్ ఇచ్చి రూ.549 చెల్లించి ఈ ఫోన్ తీసుకోవచ్చు


    ఇవే కాదు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని వాట్సప్ అందించబోతోంది. ఇప్పటికే ఉన్న డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ని మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు మాత్రమే టైమ్ సెట్ చేయొచ్చు. వాట్సప్ 24 గంటల ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే వాట్సప్‌లోని మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. ప్రస్తుతం వారం రోజుల పాత మెసేజెస్ డిలిట్ అవుతాయి. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయొచ్చు.

    Flipkart Smartphone Carnival: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ కార్నివాల్... ఈ 20 మోడల్స్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్

    RailTel Free Wifi: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు ఫ్రీ వైఫై... ఆ తర్వాత ఎంత చెల్లించాలంటే

    మరోవైపు సెల్ఫ్ డిస్‌స్ట్రక్టింగ్ ఫోటోస్ ఫీచర్‌ని కూడా పరీక్షిస్తోంది వాట్సప్. ఫోటోలు ఆటోమెటిక్‌గా డిలిట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్‌లో వచ్చే ఫార్వర్డ్ ఇమేజెస్, ఫోటోస్ యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. వాటిని డిలిట్ చేసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ డిస్‌స్ట్రక్టింగ్ ఫోటోస్ ఫీచర్ వస్తే మీరు సెట్ చేసిన సమయానికి ఆ ఫోటోలు డిలిట్ అవుతాయి.
    Published by:Santhosh Kumar S
    First published: