Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

ఐఓఎస్‌లో ఫేస్ ఐడీ, టచ్ ఐడీ ఫీచర్లను కూడా పరీక్షించింది వాట్సప్. ఇవి ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్‌పై దృష్టిపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు లభిస్తుంది.

news18-telugu
Updated: January 9, 2019, 5:00 PM IST
Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్
Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్తే. వాట్సప్‌ యాప్‌ ఓపెన్ చేయడానికి మీరు ప్యాటర్న్ లాక్, పాస్‌కోడ్ సెట్ చేసుకొని ఉంటారు. ఇకపై మీకు ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీకు అందుబాటులోకి రావడానికి ఎక్కువ రోజులేం పట్టదు. ఇప్పటికే ఈ ఫీచర్‌ని పరీక్షిస్తోంది వాట్సప్. 2.19.3 బీటా వర్షన్‌లో ఇప్పటికే కొందరికి ఫింగర్ ప్రింట్ ఫీచర్ వచ్చేసింది. యాప్‌లో ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో న్యూ సెక్షన్ కనిపించనుంది. మీరు ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేసి వాడుకోవచ్చు.

ఐఓఎస్‌లో ఫేస్ ఐడీ, టచ్ ఐడీ ఫీచర్లను కూడా పరీక్షించింది వాట్సప్. ఇవి ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్‌పై దృష్టిపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు లభిస్తుంది. ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు అందజేయనుంది. ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవాళ్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మీ యాప్‌కు ఫుల్ ప్రొటెక్షన్ లభించినట్టే.

ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ మాత్రమే కాదు... ఈ ఏడాది మరిన్ని కొత్త ఫీచర్లు అందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. అందులో డార్క్ మోడ్, మీడియా ప్రివ్యూ, స్టిక్కర్ సెర్చ్, కాన్‌సెక్యుటీవ్ వాయిస్ మెసేజ్ లాంటివి ఉండబోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

2019లో వాట్సప్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లు ఇవేనా?

'వాట్సప్ గోల్డ్' మెసేజ్ వచ్చిందా? ఓపెన్ చేస్తే అంతే...

ఈ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు... ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?

వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? మీకు బ్యాడ్ న్యూస్
Published by: Santhosh Kumar S
First published: January 9, 2019, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading