WhatsApp: వాట్సప్‌లో ఒకేసారి 8 మందితో గ్రూప్ వీడియో కాల్ చేయొచ్చు ఇలా

WhatsApp | మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఎక్కువగా వీడియో కాల్స్ మాట్లాడుతుంటారా? అయితే మీకు శుభవార్త. వాట్సప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు.

news18-telugu
Updated: April 29, 2020, 4:08 PM IST
WhatsApp: వాట్సప్‌లో ఒకేసారి 8 మందితో గ్రూప్ వీడియో కాల్ చేయొచ్చు ఇలా
WhatsApp: వాట్సప్‌లో ఒకేసారి 8 మందితో గ్రూప్ వీడియో కాల్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్ యూజర్లకు శుభవార్త. ఒకేసారి 8 మందితో గ్రూప్ వీడియో కాల్ చేసే ఫీచర్ వచ్చేసింది. గతంలో కేవలం నలుగురు మాత్రమే గ్రూప్ కాల్‌లో మాట్లాడుకునే అవకాశం ఉండేది. కానీ లాక్‌డౌన్ కారణంగా గ్రూప్ కాల్స్‌కి డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కువ గ్రూప్ కాల్స్ చేసుకునే యాప్స్ కోసం వెతుకుతున్నారు నెటిజన్లు. దీంతో వాట్సప్ ఈ లిమిట్ పెంచింది. ఒకేసారి 8 మంది గ్రూప్ వీడియో కాల్‌లో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది. మొదట బీటా యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించారు. ఆ తర్వాత మిగతా యూజర్లకు రిలీజ్ చేస్తోంది వాట్సప్. ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

మీరు కూడా మీ వాట్సప్‌లో ఒకేసారి 8 మందికి గ్రూప్ కాల్ చేయాలనుకుంటే ముందుగా మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత వీడియో కాల్స్ చేసి మీతో పాటు మరో ఏడుగురిని కాల్‌లో యాడ్ చేయొచ్చు. ఇప్పటికే గూగుల్ డ్యూయో వీడియో కాల్ యాక్టీవ్ యూజర్ల సంఖ్యను 12 చేసింది. యాపిల్ ఫేస్‌టైమ్‌లో 32 మంది గ్రూప్ కాల్ చేసుకోవచ్చు. స్కైప్‌లో 50 పార్టిసిపెంట్స్ వీడియో కాల్ మాట్లాడొచ్చు. ఫేస్‌బుక్ ఇటీవల లాంఛ్ చేసిన మెసెంజర్ రూమ్స్‌లో 50 మంది గ్రూప్ కాల్ చేసుకోవచ్చు. ఇక పాపులర్ యాప్ అయిన జూమ్‌లో ఒకేసారి 100 మంది మాట్లాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Amazon Pay Later: కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న అమెజాన్

WhatsApp: గుడ్ న్యూస్... యూజర్లకు లోన్స్ ఇవ్వనున్న వాట్సప్

Poco F2 Pro: ఇండియాకు రానున్న పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్‌ఫోన్... ప్రత్యేకతలివే
First published: April 29, 2020, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading