Home /News /technology /

GOOD NEWS TO ZOOM USERS COMPANY WILL GIVE RS 1874 HERE FULL DETAILS NS GH

Zoom: జూమ్ యాప్ వినియోగదారులకు శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.1874 చెల్లించనున్న కంపెనీ.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియా ఖాతాదారుల సమాచార భద్రత విషయంలో రాజీ పడితే భారీ పరిహారం చెల్లించక తప్పదు. తాజాగా జూమ్ యాప్ విషయంలో అదే జరిగింది. నాలుగు సంవత్సరాలపాటు వినియోగదారుల సమాచారం విషయంలో కంపెనీ సరైన విధానాలు అవలంభించలేదని తేలడంతో భారీగా పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

ఇంకా చదవండి ...
సోషల్ మీడియా (Social Media) ఖాతాదారుల సమాచార భద్రత విషయంలో రాజీ పడితే భారీ పరిహారం చెల్లించక తప్పదు. తాజాగా జూమ్ యాప్ విషయంలో అదే జరిగింది. నాలుగు సంవత్సరాలపాటు వినియోగదారుల సమాచారం విషయంలో కంపెనీ సరైన విధానాలు అవలంభించలేదని తేలడంతో భారీగా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. భద్రతా సమస్యలపై క్లాస్ యాక్షన్ దావాలో జూమ్ కంపెనీ వినియోగదారులు నుంచి రూ.1874 పొందవచ్చు. కోవిడ్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ యాప్ జూప్ (Zoom) విపరీతంగా ప్రజాదరణ పొందింది. ఇప్పటికే అత్యధికంగా వీడియో కాన్పరెన్స్ సాధనాల్లో జూమ్ ఒకటి. అయినా వినియోగదారుల భద్రత, గోప్యత విషయంలో జూమ్ విఫలమైంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీలతో పంచుకుంటోందని కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను జూమ్ ఖండించింది.

అయినా భద్రత, ప్రైవసీ విధానాలను మెరుగుపరచడానికి, కేసును పరిష్కరించుకోవడానికి కంపెనీ రూ.92.5 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. వ్యక్తిగత సమాచారం భద్రత విషయంలో రాజీపడిన వినియోగదారులకు పరిహారం చెల్లించేందుకు జూమ్ అంగీకరించింది. కంపెనీ దావా పరిష్కారం కోసం రూ.21 కోట్లు చెల్లించనుంది.అయితే 2016 నుంచి 2021 మధ్య జూమ్ పెయిడ్ సబ్‌స్క్రైబర్ అయిన వారే పరిహారం పొందడానికి అర్హులు. అలాంటి వారు రూ.1874 లేదా, చెల్లించిన మొత్తంలో 15 శాతం తిరిగిపొందవచ్చు.
Facebook: ఫేసుబుక్​లో కొత్తగా టూ ఫ్యాక్టర్​ అథెంటికేషన్ ఫీచర్​​.. వీఐపీల ఖాతాలకు మరింత భద్రత

జూమ్​ పెయిడ్​ మెంబర్లకు మాత్రమే..
2016 మార్చి 30 నుంచి 2021 జూలై 30లోపు జూమ్ మీటింగ్ యాప్ లో నమోదు చేసుకున్న, ఉపయోగించిన, తెరచిన, డౌన్ లోడ్ చేసిన ఇతర వినియోగదారులు కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ మొత్తానికి అర్హులు. అయితే వారు రూ.1874 కోసం క్లెయిమ్ చేసుకోలేరు. వారు కేవలం రూ.1125 మాత్రమే పొందవచ్చు. నగదు పొందాలంటే క్లెయిమ్ చేసుకోవాలి. దావా వేయడానికి క్లెయిమ్ ఫారం పూర్తించి సమర్పించాలి. ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో జూమ్ మీటింగ్ క్లాస్ యాక్షన్ వెబ్ సైట్ (ZoomMeetingsClassAction.com) ద్వారా, మెయిల్ ద్వారా పంపించవచ్చు. దీనికి మార్చి 5, 2022 గడువు విధించారు.
Green hydrogen car: హైడ్రోజన్​ కారును కొనుగోలు చేసిన నితిన్​ గడ్కరీ.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

కంపెనీ నుంచి క్లెయిమ్ పొందడానికి గడువు తేదీ కంటే ముందే పైల్ చేయాల్సి ఉంటుంది. జూమ్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకుందని కొందరు వేసిన దావా మేరకు, క్లెయిమ్ ద్వారా నగదు ఎలా పొందాలో మెయిల్ పంపింది. జూమ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కోసం 2016 మార్చి 30 నుంచి 2021 జూలై 30 మధ్య పెయిడ్ మెంబర్ అయితే కోర్ సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లించిన డబ్బులో రూ.1874 లేదా చెల్లించిన మొత్తంలో 15 శాతం తిరిగి పొందవచ్చు. 2016 నుంచి 2021 మధ్య కాలంలో మీరు జూమ్ యాప్ పై రూ.5625 ఖర్చు చేసి ఉంటే రూ.1874 క్లెయిమ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Social Media, Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు