GOOD NEWS TO WHATSAPP USERS NOW ENABLE DISAPPEARING MESSAGES FEATURE FOR INDIVIDUAL CHATS SS
WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఛాటింగ్ చేసేవారికి మరో కొత్త ఫీచర్
WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఛాటింగ్ చేసేవారికి మరో కొత్త ఫీచర్
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఛాటింగ్ చేసేవారికి మరో కొత్త ఫీచర్ (WhatsApp Feature) రిలీజ్ చేసింది వాట్సప్. పర్సనల్ ఛాట్స్ చేసేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
రెండేళ్ల క్రితం వాట్సప్ నుంచి డిసప్పియరింగ్ మెసేజెస్ (Disappearing Messages) ఫీచర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ రిలీజ్ చేసిన తర్వాత ఇందులో పలు మార్పులు చేస్తోంది వాట్సప్ (WhatsApp). లేటెస్ట్గా డిసప్పియరింగ్ మెసేజెస్‌లో మరో మార్పు తీసుకొచ్చింది. గతంలో గ్రూప్స్‌కి మాత్రమే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పర్సనల్ ఛాట్స్‌కి కూడా ఈ ఫీచర్ ఎనేబుల్ చేయొచ్చు. గ్రూప్స్‌లోనే కాదు వ్యక్తిగత ఛాట్స్‌లో కూడా 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల లిమిట్ సెట్ చేసుకోవచ్చు. పర్సనల్‌గా ఛాట్స్ చేసేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఎలా పనిచేస్తుందంటే యూజర్లు ఈ ఫీచర్ ఆన్ చేసి, ఏదైనా టైమ్ లిమిట్ సెట్ చేస్తే ఆ టైమ్ దాటగానే మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. ఉదాహరణకు ఏదైనా పర్సనల్ ఛాట్‌లో డిసప్పియరింగ్ మెసేజెస్ ఎనేబుల్ చేసి 24 గంటల టైమ్ సెట్ చేశారనుకుందాం. ఆ వ్యక్తికి పంపే మెసేజెస్ అన్నీ 24 గంటల తర్వాత ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి.
ఇక వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్‌లో కొత్త టైమ్ లిమిట్స్ కూడా రాబోతున్నాయి. ఒక గంట, 8 నిమిషాలు, 16 సెకండ్ల టైమ్ లిమిట్‌ను వాట్సప్ టెస్ట్ చేస్తోందన్న వార్తలొస్తున్నాయి. అయితే ఇలాంటి ఫీచర్స్ అన్నింటినీ ముందుగా బీటా యూజర్లతో టెస్ట్ చేయిస్తుంది వాట్సప్. ఆ తర్వాత యూజర్లందరికీ రిలీజ్ చేస్తుంది. వాట్సప్‌లో డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎలా ఆన్ చేయాలో తెలుసుకోండి.
వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఎనేబుల్ చేయండి ఇలా
Step 1- ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
Step 2- అందులో ఏదైనా గ్రూప్ లేదా ఛాట్ ఓపెన్ చేయండి.
Step 3- కాంటాక్ట్ పేరు మీద ట్యాప్ చేయండి.
Step 4- మీకు Disappearing messages కనిపిస్తుంది.
Step 5- డిఫాల్ట్‌గా డిసప్పియరింగ్ మెసేజెస్ ఆఫ్‌లోనే ఉంటుంది.
Step 6- ఈ ఫీచర్ ఆన్ చేసి 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల్లో ఏదో ఓ టైమ్ లిమిట్ ఎంచుకోండి.
Step 7- మీరు ఎంచుకున్న టైమ్ ప్రకారం ఆ ఛాట్ లేదా గ్రూప్‌లో మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి.
ఈ ఫీచర్ ద్వారా మెసేజెస్ అన్నీ డిలిట్ అయితే ముఖ్యమైన మెసేజెస్ ఎలా సేవ్ చేసుకోవాలన్న సందేహం రావడం మామూలే. ఇందుకోసం వాట్సప్ ఈ ఫీచర్లో చిన్న మార్పు చేయబోతోంది. యూజర్లు కావాలనుకుంటే కొన్ని మెసేజెస్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ పనిచేయకుండా చేయొచ్చు. అంటే ఏదైనా ఛాట్‌కి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉన్నా, మీకు కావాలనుకున్న మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ కాకుండా ఆపొచ్చు. ఈ ఫీచర్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.