TikTok Videos: టిక్‌టాక్ యాప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్

TikTok | టిక్‌టాక్ యాప్‌లో కొత్త మ్యూజిక్ ట్రాక్స్ అందుబాటులోకి వచ్చేశాయి. యూజర్లు కొత్త మ్యూజిక్ ఆడియోలను తమ వీడియోలకు ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: January 24, 2020, 6:15 PM IST
TikTok Videos: టిక్‌టాక్ యాప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్
TikTok Videos: టిక్‌టాక్ యాప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టిక్‌టాక్... యువతకు పరిచయం అక్కర్లేని యాప్. వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదిస్తున్న స్టార్లు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఇండియాలో టిక్‌టాక్ యాప్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది. మీరు టిక్‌టాక్ యాప్ వాడుతున్నారా? ఫన్నీ వీడియోలు రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీ టిక్‌టాక్ వీడియోలను మరింత అద్భుతంగా మార్చేందుకు కంపెనీ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. మెర్లిన్‌తో డీల్ కుదుర్చుకున్న టిక్‌టాక్... సరికొత్త మ్యూజిక్స్‌ని అందించనుంది. లక్షలాది లైసెన్స్‌డ్ మ్యూజిక్ ఆడియోలను యాక్సెస్ చేయొచ్చు. వాటిని మీ టిక్‌టాక్ వీడియోస్‌కి వాడుకోవచ్చు.

టిక్‌టాక్‌లో మ్యూజిక్ క్రియేషన్ దగ్గర్నుంచి ఉపయోగించడం వరకు ఇండిపెండెంట్ ఆర్టిస్టులు, లేబుల్స్ కీలకమని, మెర్లిన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా టిక్‌టాక్ యూజర్లకు సరికొత్త లేబుల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని టిక్‌టాక్ ప్రకటించింది. ఇప్పటికే టిక్‌టాక్ యాప్‌లో కొత్త మ్యూజిక్ ట్రాక్స్ అందుబాటులోకి వచ్చేశాయి. యూజర్లు కొత్త మ్యూజిక్ ఆడియోలను తమ వీడియోలకు ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు కావాలా? ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి



Good News: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన షావోమీ

WhatsApp Stickers: వాట్సప్‌లో మీ స్టిక్కర్స్ మీరే ఇలా తయారు చేసుకోండి
First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు