భారత మార్కెట్లోకి వరుస స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ దూకుడుమీదుంది రియల్మీ సంస్థ. ఈ సంస్థ నుంచి సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్ తో.. ఫైజీ ఫోన్.. అది కూడా 10 వేల రూపాయలలోపు ధరతో త్వరలోనే మార్కెట్ లోకి రానుంది.
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు శుభవార్త.. ఎప్పటికప్పుడు అతి తక్కువ ధరలోనే ట్రెండ్ అప్ డేట్ అవ్వాలి అనుకునే వారికి నిజంగా ఇది శుభవార్తే.. భారత మార్కెట్లోకి వరుస స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ దూకుడుమీదుంది రియల్మీ సంస్థ. ఈ సంస్థ నుంచి సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి. దీంతో మార్కెట్లో వీటికి మంచి ఆదరణ లభిస్తుంది. ఇదే జెట్ స్పీడ్ వేగంతో వచ్చే ఏడాది నాటికి అతి తక్కువ ధరలో 5జీ మోడళ్లను తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ శేత్ ట్వీట్ చేశారు. రియల్మీ వచ్చే ఏడాది నాటికి రూ. 10 వేలలోపు ధరలో 5జీ ఫోన్లను ఆవిష్కరించనుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేవలం 100 డాలర్లు అంటే ( సుమారు 7,500) లకే 5 జి ఫోన్‌ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, రియల్మీ నుంచి 15 వేల ధర పైబడి విడుదలయ్యే ప్రతి మోడల్లో 5జీ సపోర్ట్ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు హామీ ఇస్తున్నట్లు #realmeFans హ్యాష్ ట్యాగ్ జత చేసి ట్వీట్ చేశారు.
రియల్మీ నుంచి రాబోయే మూడు నెలల్లోపు జీటీ సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు మాధవ్ ప్రకటించారు. దీన్ని ధ్రువీకరిస్తూ #realmeGT అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. మరోవైపు ఇప్పటికే మంచి ఆదరణ పొందిన నార్జో సిరీస్‌ను కూడా విస్తరిస్తామని సీఈవో మధవ్ శేత్ పేర్కొన్నారు. దీన్ని ధ్రువీకరిస్తూ # #DemocratizerOf5G అనే హ్యాష్ ట్యాగ్ జతచేసి ట్వీట్ చేశారు.
త్వరలోనే రియల్మీ జిటి సిరీస్..
రియల్మీ నుంచి గతేడాది రియల్మీ ఎక్స్ 50 ప్రో 5జీ లాంచ్ అయ్యింది. ఈ మొబైల్‌తో మొట్టమొదటి 5జీ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే, రియల్మీ ఇటీవల దేశంలో తన 5జీ ఫోన్ పోర్టుఫోలియోను విస్తరించింది. రియల్మీ 5జీ, రియల్మీ నార్జో 30 ప్రో, రియల్మీ ఎక్స్ 7 మాక్స్ వంటి 5జీ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలోనే వచ్చే త్రైమాసికంలో రియల్మీ జిటి సిరీస్‌ను దేశంలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కాగా, లీకైన స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే రియల్హీ జీటీ సరీస్‌లో అద్భుతమైన ఫీచర్లను అందించినట్లు తెలుస్తోంది. కెమెరా విషయంలో అద్భుతాలు చేసిందని లీకులను బట్టి తెలుస్తోంది. అయితే, రియల్మీ జీటీ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత లేదు. రియల్ మీ నుంచి అతి తక్కువ ధరకు లభించనున్న ఆ ఫోన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నరు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.