Home /News /technology /

స్మార్ట్ ఫోన్ లవర్లకు గుడ్ న్యూస్.. OnePlus 9 Pro 5G ఫోన్ పై పది వేలకు పైగా డిస్కౌంట్

స్మార్ట్ ఫోన్ లవర్లకు గుడ్ న్యూస్.. OnePlus 9 Pro 5G ఫోన్ పై పది వేలకు పైగా డిస్కౌంట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

5G స్మార్ట్ ఫోన్(5G Smartphone) కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. ప్రముఖ OnePlus 9 Pro స్మార్ట్ ఫోన్ పై రూ. 10 వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    5G టెక్నాలజీ(5G Technology) రాకముందే, 5G స్మార్ట్‌ఫోన్‌లు(5G Smartphones) బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఈ సమయంలో మీరు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ప్రముఖ వన్‌ప్లస్ కు చెందిన 5G ఫోన్‌ను చాలా సరసమైన ధరలో సొంతం చేసుకోవచ్చు. OnePlus 9 Pro ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 64, 999 కాగా ప్రస్తుతం డిస్కౌంట్ పై రూ. 58,999 కి అందుబాటులో ఉంది. ఇంకా ఈ ఫోన్ పై రూ. 3,000 తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ ను అందుకోవచ్చు. దీంతో పాటు ఎక్సేంజ్ పై రూ. 3 వేల తగ్గింపు సైతం లభిస్తోంది. OnePlus.in వెబ్ సైట్లో షాపింగ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ ను అందుకోవచ్చు.

    OnePlus 9 Pro స్పెసిఫికేషన్లు:
    ఇంకా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. OnePlus 9 Pro రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ మరియు 12GB + RAM 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. OnePlus 9 Pro 6.7-అంగుళాల QHD + AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1440×3216 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఆక్సిజన్ OS 11లో పనిచేస్తుంది.
    Xiaomi వినియోగదారులకు శుభవార్త! MIUI 13 పై తాజా అప్ డేట్ ఇదే..

    ఈ ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం, కంపెనీ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందించింది. ఇంకా OnePlus 9 Pro 4500 mAh భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
    OnePlus Nord 2: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... కొత్త నార్డ్ 2 వచ్చేస్తోంది

    ఈ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం, Wi-Fi 6, 5G, 4G LTE, బ్లూటూత్ వెర్షన్ 5.2, GPS, A-GPS మరియు USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించబడ్డాయి. ఇంకెందుకు ఆలస్యం OnePlus.inలో షాపింగ్ చేసి OnePlus 9 Pro ను సరసమైన ధరలో సొంతం చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, ONE PLUS, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు