హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 13: ఐఫోన్​​ లవర్స్​కు అదిరిపోయే శుభవార్త.. ఐఫోన్​ 13పై ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్​

iPhone 13: ఐఫోన్​​ లవర్స్​కు అదిరిపోయే శుభవార్త.. ఐఫోన్​ 13పై ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఫోన్లను కొనే స్తోమత లేక చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పింది యాపిల్​ సంస్థ. ఐఫోన్​ 13 సిరీస్​పై భారీ డిస్కౌంట్​ ప్రకటించింది.

యాపిల్​ ఐఫోన్లకు (Iphone) మార్కెట్​లో ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐఫోన్ ఉండటాన్ని చాలా మంది స్టేటస్​ సింబల్​గా భావిస్తారు. అంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రీమియం ధరలో లభించే ఐఫోన్లను కొనే స్తోమత లేక చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పింది యాపిల్​ (Apple) సంస్థ. ఐఫోన్​ 13 (Iphone 13) సిరీస్​పై భారీ డిస్కౌంట్​ ప్రకటించింది. ఐఫోన్​ 13 మినీ, ఐఫోన్​ 13, ఐఫోన్​ 13 ప్రో, ఐఫోన్​ 13 ప్రో మాక్స్​ మోడళ్లపై ఈ ఆఫర్​ వర్తిస్తుంది. యాపిల్​ ప్రకటించిన ఆఫర్లను సరిగ్గా ఉపయోగించుకుంటే దాదాపు రూ. 24 వేల తగ్గింపు పొందవచ్చు. ఎలాగో చూద్దాం.

ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్​..

ఐఫోన్​ 13 స్మార్ట్‌ఫోన్ మార్కెట్​లో రూ. 79,900 ధర వద్ద లభిస్తుండగా దీనిపై భారీ డిస్కౌంట్లు​ ప్రకటించింది. హెచ్​డీఎఫ్​సీ కార్డు ఉపయోగించి ఐఫోన్​ 13 కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది. ఇక, హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డుతో ఈఎంఐ ఆప్షన్​లో కొనుగోలు చేసినా సరే ఈ ఆఫర్​ వర్తిస్తుంది. అంటే, హెచ్​డీఎఫ్​సీ కార్డును ఉపయోగించి ఐఫోన్​ 13ను కేవలం రూ. 73,900 వద్ద కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord N20 5G: త్వరలోనే వన్​ప్లస్​ నార్డ్​ ఎన్​ 20 5G స్మార్ట్​ఫోన్​.. ఆన్​లైన్​లో లీకైన ఫీచర్ల వివరాలివే!


అదే సమయంలో మన దగ్గర మంచి కండీషన్​లో ఉన్న పాత ఐఫోన్​ను ఎక్స్ఛేంజ్​ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. పాత ఐఫోన్​ను ఐస్టోర్​లో ఎక్స్ఛేంజ్​ చేసుకోవచ్చు. దీని ద్వారా రూ. 18 వేల తగ్గింపు లభిస్తుంది. అదే క్రమంలో ఐఫోన్​ 11 లేదా అంతకన్నా కొత్త మోడల్స్​ను ఎక్స్ఛేంజ్​ చేస్తే మరింత డిస్కౌంట్​ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇందుకు బోనస్​ కింద అదనంగా రూ. 3000 డిస్కౌంట్​ లభిస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే ఐఫోన్​ 13 ధర రూ. 55,900కు చేరుతుంది.

Budget Smartphone: కేవలం రూ. 6,200కే 6000mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. వివరాలివే

అంటే, అన్ని ఆఫర్లను పోను రూ. 79,900 విలువ గల ఐఫోన్​ 13ను కేవలం రూ. 55,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే, మీరు ఏకంగా రూ. 24 వేల తగ్గింపు పొందవచ్చు. ఇటీవల ప్రకటించిన అన్ని ఆఫర్లలో కెల్లా ఇదే పెద్ద ఆఫర్​ అని యాపిల్​ సంస్థ ప్రకటించింది. ఐఫోన్​ లవర్స్​ ఈ ఆఫర్లను ఉపయోగించుకోవాలని కోరింది.

Infinix Note 11i: ఇన్ఫినిక్స్ నోట్ 11ఐ స్మార్ట్​ఫోన్ లాంచ్​... బడ్జెట్​ ధరలోనే అద్భుతమైన గేమింగ్​ డివైజ్​

భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు..

ఐఫోన్​ 13 స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల OLED డిస్​ప్లేతో వస్తుంది. ఇది A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 13 మెరుగైన బ్యాటరీతో వస్తుంది. ఈ డివైజ్​ ఐఫోన్​ 12 కంటే 1.5 గంటల అదనపు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్​ 13 కొత్త 12 -మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్‌ కెమెరాతో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్​ కెమెరాను కూడా చేర్చింది.

First published:

Tags: Apple, Iphone, Smartphone

ఉత్తమ కథలు