హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Docs: గూగుల్ డాక్యుమెంట్స్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఈ కొత్త అప్‌డేట్స్, ఫీచర్ల గురించి తెలుసుకోండి..

Google Docs: గూగుల్ డాక్యుమెంట్స్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఈ కొత్త అప్‌డేట్స్, ఫీచర్ల గురించి తెలుసుకోండి..

గూగుల్ డాక్యుమెంట్స్ వాడే వారికి గుడ్ న్యూస్..కొత్త అప్‌డేట్స్, ఫీచర్ల గురించి తెలుసుకోండి

గూగుల్ డాక్యుమెంట్స్ వాడే వారికి గుడ్ న్యూస్..కొత్త అప్‌డేట్స్, ఫీచర్ల గురించి తెలుసుకోండి

కొత్త ఫీచర్లతో మరింత మెరుగైన సేవలతో అప్‌డేట్ అయిన గూగుల్ డాక్యుమెంట్స్ (Google Docs).. యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా డాక్యుమెంట్లలో టేబుల్స్‌ను కస్టమైజ్ చేయడానికి అనేక కొత్త మార్గాలను గూగుల్(Google) జోడించింది.

టైపింగ్, డాక్యుమెంటేషన్ వర్క్ కోసం బాగా ఉపయోగించే ప్రముఖ యాప్‌ల్లో గూగుల్‌ డాక్స్‌ (Google Docs) పైవరుసలో ఉంటుంది. ఇప్పటికే చాలా మందికి ఫేవరేట్ యాప్‌గా మారిన గూగుల్‌ డాక్స్‌ ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో మరింత మందిని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం గూగుల్ సంస్థ సరికొత్త అప్‌డేట్‌తో గూగుల్ డాక్స్‌ను మరింత యూజ్‌‌ఫుల్‌‌గా మారుస్తోంది. గూగుల్ అందిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్‌తో యూజర్లు డాక్స్‌లో ఇన్‌లైన్ టేబుల్స్ అత్యంత సులభంగా సృష్టించి, సవరించవచ్చు. ఈ అప్‌డేట్‌తో డాక్స్‌ యాప్ మరింత మెరుగు పడుతుంది. అంతేకాదు, ఇందులోని సాంకేతిక సమస్యలు అన్ని ఫిక్స్ అవుతాయి. గూగుల్ యాజమాన్యంలోని ఈ టైపింగ్ సాఫ్ట్‌వేర్‌ ఆఫర్ చేస్తున్న ఆటో సేవ్, ఈజీ షేరింగ్ వంటి ఫీచర్లు ఇప్పటికే పాత మైక్రోసాఫ్ట్ వర్డ్ యూజర్లను కూడా ఆకట్టుకున్నాయి. అయితే కొత్త ఫీచర్లతో మరింత మెరుగైన సేవలతో అప్‌డేట్ అయిన గూగుల్ డాక్యుమెంట్స్.. యూజర్లను ఆకట్టుకుంటోంది.

తాజాగా డాక్యుమెంట్లలో టేబుల్స్‌ను కస్టమైజ్ చేయడానికి అనేక కొత్త మార్గాలను గూగుల్ జోడించిందని గూగుల్ కంపెనీ బ్లాగ్ పోస్ట్ వెల్లడించింది. కొత్త ఫీచర్‌లలో టేబుల్ ప్రాపర్టీలను మేనేజ్ చేయడానికి సైడ్‌బార్ కూడా ఉంటుంది. కొత్త ఫీచర్ల సాయంతో అడ్డు వరుసలు, నిలువు వరుసలు, టేబుల్ అలైన్‌మెంట్స్ అడ్జస్ట్ చేయవచ్చు. గూగుల్ డాక్ వినియోగించి డాక్యుమెంట్‌లో మీరు చేసే అన్ని ఎడిట్స్ రియల్ టైమ్‌లో డాక్యుమెంట్‌లో కనిపిస్తాయి. కొత్త అప్‌డేట్ అనేది టేబుల్‌లోని అడ్డు వరుస లేదా నిలువు వరుసను వేరే స్థానానికి డ్రాగ్ చేయడానికి యూజర్లకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు, ఇప్పుడు యూజర్లు టేబుల్‌లోని ఒక నిలువు వరుసను లేదా అడ్డు వరుసను పిన్ చేయవచ్చు.

Jio New Plans: జియో నుంచి సంచలన ప్లాన్లు.. కేవలం రూ.152కే అన్ లిమిటెడ్.. పూర్తి వివరాలివే

అప్పుడు ఆ వరుసలు టేబుల్‌లోని ప్రతి పేజీలో పైభాగాన కనిపిస్తాయి. దీనివల్ల యూజర్లు ప్రతిసారీ పైకి లేదా కిందకి స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా పెద్ద టేబుల్ లో ఎంత కిందకి స్క్రోల్ చేసుకున్నా.. పైన మాత్రం పిన్ చేసిన వరుసలు కనిపిస్తూనే ఉంటాయి. దీని వల్ల డాక్స్‌లో వర్క్ చేయడం మరింత సులభమవుతుంది. కొత్త ఫీచర్లతో సాయంతో గూగుల్ డాక్స్ యూజర్లు ఒక టేబుల్ వరుసను కూడా మార్చగలరు. తద్వారా టేబుల్ అనేది రెండు పేజీల మధ్య సగంలో కట్ అవ్వదు. దీనివల్ల టేబుల్ కంటెంట్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచగల వెసులుబాటు యూజర్లకు ఉంటుంది.

Microsoft: నిరుద్యోగులకు మైక్రోసాఫ్ట్​ గుడ్​న్యూస్​.. సైబర్​ సెక్యూరిటీలో ఉచిత ఆన్​లైన్​ ట్రైనింగ్.. వివరాలివే

యూజర్లు టేబుల్ ఫార్మాటింగ్, లేఅవుట్ మీద మరింత కంట్రోల్ కలిగి ఉండేలా కొత్త ఫీచర్లు సాయపడతాయి. గూగుల్ డాక్స్ ఇప్పుడు యూజర్లు వారి టేబుల్ వరుసలను క్రమబద్ధీకరించడానికి (sort) కూడా అనుమతిస్తుంది. అలాగే, టేబుల్‌కి పిన్ చేసిన ఏవైనా హెడర్‌లు టేబుల్ పైభాగంలోనే ఉంటాయి. ఇది కాకుండా, కంటెంట్ రకాన్ని బట్టి టేబుల్ అడ్డు వరుసలను యూజర్లు సార్ట్ చేయగలరు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Google, Google Drive

ఉత్తమ కథలు