Home /News /technology /

APPLE TV APP: యాపిల్ లవర్స్ గుడ్​న్యూస్​​.. ఇక స్మార్ట్ టీవీలు, అన్ని స్ట్రీమింగ్ డివైజెస్​లో యాపిల్ టీవీ యాప్.. వివరాలివే

APPLE TV APP: యాపిల్ లవర్స్ గుడ్​న్యూస్​​.. ఇక స్మార్ట్ టీవీలు, అన్ని స్ట్రీమింగ్ డివైజెస్​లో యాపిల్ టీవీ యాప్.. వివరాలివే

ప్రతీకాాత్మక చిత్రం

ప్రతీకాాత్మక చిత్రం

యాపిల్​ తన వినియోగదారులకు సూపర్ గుడ్​న్యూస్​ చెప్పింది. ఇక నుంచి యాపిల్ టీవీ యాప్​ ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉండనుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

టెక్ దిగ్గజం​ యాపిల్​ తన వినియోగదారులకు అదిరిపోయే గుడ్​న్యూస్​ చెప్పింది. ఇప్పటి వరకు కేవలం ఐఓఎస్​ టీవీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న యాపిల్ టీవీ యాప్​ ఇక నుంచి ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో స్మార్ట్ టీవీలు, అన్ని స్ట్రీమింగ్ డివైజెస్​లో యాపిల్ టీవీ యాప్​ను వినియోగించుకోవచ్చు. ఇది మొదట్లో ఐఓఎస్​ డివైజెస్​లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, దీన్ని ఇప్పుడు అమెజాన్ ఫైర్ ఓఎస్ ఎకోసిస్టమ్, ఎల్​జీ వెబ్ ఓఎస్ వంటి ఇతర ప్లాట్​ఫామ్​లకు కూడా విస్తరించింది. ఆండ్రాయిడ్ సపోర్ట్​ చేసే టీవీల్లో వినియోగించుకునేందుకు ఈ యాప్​ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. 9 to5 గూగుల్​ నివేదిక ప్రకారం.. ఈ యాప్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆండ్రాయిడ్​ టీవీలో ఇన్​స్టాల్ చేసుకొని యాక్సెస్​ చేసుకోవచ్చు. అయితే, యాపిల్​ ప్లస్​లోని ప్రీమియం కంటెంట్​ను డాల్డీ విజన్​, డాల్బీ అట్మోస్​ సపోర్ట్​ కలిగిన టీవీల్లో మాత్రమే యాక్సెస్​ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిలో హెచ్‌డిఆర్‌, అల్ట్రా-హెచ్‌డి రిజల్యూషన్​తో కంటెంట్‌ను యాక్సెస్​ చేసుకోవచ్చు.
OnePlus Nord CE 5G: వన్‌ప్లస్ నార్డ్​ సీఈ 5జీ​ స్పెసిఫికేషన్లు లీక్​.. అదిరిపోయే లుక్​తో అద్భుతమైన ఫీచర్లు.. వివరాలివే

ఈ నిర్ణయం భారతీయ వినియోగదారులకు పెద్ద వెసులుబాటు అనే చెప్పవచ్చు. ఎందుకంటే, భారత్​లో ఎక్కువగా ఆండ్రాయిడ్​ టీవీలనే ఉపయోగిస్తారు. యాపిల్​ స్మార్ట్​టీవీల వినియోగం ఇక్కడ చాలా తక్కువ. సోనీ, షియోమి, రియల్‌మీ, టిసిఎల్, వూ, వన్‌ప్లస్‌ వంటి సంస్థలు ఆండ్రాయిడ్​ ఆధారిత స్మార్ట్​టీవీలనే విక్రయిస్తున్నాయి. యాపిల్​ స్మార్ట్​టీవీలతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువ. అందువల్లే, ఎక్కువ మంది వినియోగదారులు ఆండ్రాయిడ్​ టీవీలనే కొనుగోలు చేస్తుంటారు.

ఆండ్రాయిడ్​ టీవీల్లోనూ యాక్సెస్​..
యాపిల్ టీవీకి మార్కెట్​లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + (భారతదేశంలో డిస్నీ + హాట్‌స్టార్) వంటివి గట్టి పోటీనిస్తున్నాయి. ఇవి ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. యాపిల్​ టీవీ యాప్​ భారత మార్కెట్​లో రాణించాలంటే వీటిని తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉంది. అయితే, దీనిలో ప్రసారమయ్యే టాక్​ షోలు, సినిమాలు ఎక్కువ మందిని ఎట్రాక్ట్​ చేసే అవకాశం ఉంది.

ది మార్నింగ్​ షో, గ్రేహౌండ్​, ఫర్​ ఆల్​ మ్యాన్​కైండ్​, చెర్రీ వంటి వెబ్​సిరీస్​లు మంచి పాపులారిటీని సంపాదించాయి. తద్వారా తక్కువ సమయంలోనే యాపిల్​ ప్లస్ గణనీయమైన యూజర్లను దక్కించుకునే అవకాశం ఉంది. అయితే యాపిల్ టీవీ ప్లస్​లో ప్రీమియం కంటెంట్ యాక్సెస్ చేసుకునేందుకు యాపిల్ టీవీ ప్లస్ సబ్​స్క్రిప్షన్ తీసుకోవాలి. కొత్త కస్టమర్లకు నెల రోజుల పాటు ఉచిత సభ్యత్వం అందిస్తుంది. దీని ప్రకారం జూలై 3 వరకు ఉచితంగా ప్రీమియం కంటెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple, Iphone, Smart TV

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు