నేటి టెక్ యుగంలో అంతటా ఇంటర్నెట్ (Internet) హవా నడుస్తోంది. ప్రపంచమంతా ఇప్పుడు ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం, చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఇక నగరాల్లో అయితే దాదాపు ప్రతి ఇంటికి కూడా వైఫై తప్పనిసరిగా మారింది. మరోవైపు, కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home), ఆన్లైన్ క్లాసెస్ (Online Class) కల్చర్ పెరగడంతో ఇంట్లో ఇంటర్నెట్ ఉంటేనే చాలా మందికి కంఫర్ట్‌గా ఫీలవుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అన్ని బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు వరుసగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థ యాక్ట్ ఫైబర్ ప్రస్తుత కస్టమర్లందరికీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు 500 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ అప్గ్రేడ్లను ఉచితంగా అందిస్తోంది.
యాక్ట్ ఫైబర్ నెట్ యాప్ ద్వారా నేరుగా స్పీడ్ అప్‌గ్రేడ్ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయా నగరాల్లో కంపెనీ అనేక రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అమలు చేస్తోంది. ఈ స్పీడ్ బూస్ట్ ఆఫర్ గురించి తెలిసేలా యాక్ట్ ఫైబర్ తన కస్టమర్లందరికీ ఈ–మెయిల్ పంపిస్తోంది. యాక్ట్ ఫైబర్ పాత, కొత్త కస్టమర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని, నవంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుందని తెలిపింది. ఇదే విషయాన్ని ప్రముఖ గాడ్జెట్స్ 360 కూడా ధృవీకరించింది.
iPhone 13: ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త.. ఐఫోన్ 13పై ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్
నవంబర్ 30 వరకు మాత్రమే..
ఆఫర్ విషయానికి వస్తే.. కస్టమర్ ప్రస్తుత ప్లాన్ స్పీడ్ 100Mbps కంటే తక్కువగా ఉంటే.. తమ డేటా స్పీడ్‌ను 100Mbpsకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 100Mbps నుంచి 300Mbps మధ్య డేటా స్పీడ్ గల కస్టమర్లు తమ డేటా స్పీడ్‌ను 300Mbpsకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 300Mbps నుంచి 500Mbps మధ్య డేటా డేటా స్పీడ్ గల కస్టమర్లు తమ డేటా స్పీడ్‌ను 500Mbpsకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. యాక్ట్ ఫైబర్‌నెట్ యాప్‌కి లాగిన్ అవ్వడం ద్వారా స్పీడ్ బూస్ట్ ప్రయోజనాన్ని పొందవచ్చు. యాప్ హోమ్ స్క్రీన్‌పై కనిపించే ఆఫర్ సెక్షన్లోకి వెళ్లి మీ డేటా స్పీడ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దీంతో లాక్డౌన్ కాలంలో తన కస్టమర్లకు మద్దతు ఇవ్వడానికి గతేడాది ఇదే విధమైన స్పీడ్ బూస్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో బ్రాడ్‌బ్యాండ్ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ఈ ఆఫర్‌ను మరోసారి ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Internet, Online classes, Work From Home