Home /News /technology /

GOOD NEWS SOON WHATSAPP GROUP ADMINS CAN DELETE MESSAGES OF OTHERS IN GROUPS SS

WhatsApp Groups: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్... ఇక ఆ సమస్యకు చెక్

WhatsApp Groups: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్... ఇక ఆ సమస్యకు చెక్
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Groups: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్... ఇక ఆ సమస్యకు చెక్ (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Groups | వాట్సప్ గ్రూప్‌లో ఉన్నవారికి అలర్ట్. ఇక గ్రూప్ అడ్మిన్‌కు మరిన్ని అధికారాలు రాబోతున్నాయి. వాట్సప్‌లో ఎవరు పంపిన మెసేజ్‌నైనా గ్రూప్ అడ్మిన్ డిలిట్ చేయొచ్చు. ఈ ఫీచర్ (WhatsApp Feature) త్వరలో రాబోతోంది.

    మీరు ఏదైనా వాట్సప్ గ్రూప్ (WhatsApp Group) అడ్మిన్‌గా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. వాట్సప్‌లో గ్రూప్ అడ్మిన్ల కోసం ప్రత్యేకమైన ఫీచర్ (WhatsApp Feature) వచ్చేసింది. స్నేహితులు, బంధువులు, ఉద్యోగులు... ఇలా కొందరు కలిసి ఒకే చోట తమ అభిప్రాయాలు పంచుకోవడం కోసం వాట్సప్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఎవరైనా అందులో మెసేజెస్ చేయొచ్చు. అయితే ఒక్కోసారి కొన్ని మెసేజ్‌లు గ్రూప్‌లో ఇతర సభ్యులకు ఇబ్బందిగా మారుతుంటాయి. ఆ మెసేజ్ పంపినవారు తప్ప ఇతరులు ఎవరూ వాటిని డిలిట్ చేయలేరు. ఆ మెసేజ్ డిలిట్ చేయాలంటూ మెసేజ్ పంపినవారిని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇకపై ఈ సమస్య ఉండదు.

    వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌లు తమ గ్రూప్‌లో వచ్చిన ఏ మెసేజ్‌నైనా డిలిట్ చేయొచ్చు. అంటే సదరు వాట్సప్ గ్రూప్ నిర్వహిస్తున్నవారికి ఆ గ్రూప్‌ను సరిగ్గా నిర్వహించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గ్రూప్‌లో అభ్యంతరకరమైన మెసేజ్, ఫోటో, వీడియో లాంటివి వస్తే వాటిని పంపినవారిని అడగాల్సిన అవసరం లేకుండా గ్రూప్ అడ్మిన్ డిలిట్ చేయొచ్చు. అంటే వాట్సప్ గ్రూప్‌లో వచ్చే ప్రతీ మెసేజ్, ఫోటో, వీడియో లాంటివి ఆ గ్రూప్‌లో ఉండాలో ఉండకూడదో గ్రూప్ అడ్మిన్ నిర్ణయించొచ్చు.

    Flipkart Sale: స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇదే లాస్ట్ ఛాన్స్... ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్


    వాట్సప్‌లో ఈ కొత్త ఫీచర్ రాబోతున్నట్టు Wabetainfo తెలిపింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను Wabetainfo షేర్ చేసింది. వాట్సప్ 2.22.1.1 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ ఉంది. ఈ అప్‌డేట్ పొందినవారు ఈ ఫీచర్ వాడుకోవచ్చు. వాట్సప్ అడ్మిన్ తమ గ్రూప్‌లో మెసేజ్ డిలిట్ చేయొచ్చు. గ్రూప్ అడ్మిన్ గ్రూప్‌లో మెసేజ్ డిలిట్ చేస్తే “this was removed by an admin” అని కనిపిస్తుంది.

    iQOO Z5 5G: ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 తగ్గింపు... పాపులర్ ప్రాసెసర్‌తో పాటు మరెన్నో ప్రత్యేకతలు

    వాట్సప్ గ్రూప్‌లో ఎంతమంది అడ్మిన్స్ ఉంటే వారందరూ ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఏ మెసేజ్ నైనా డిలిట్ చేయడానికి వారికి హక్కు ఉంటుంది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. బీటా టెస్టర్లు సక్సెస్‌ఫుల్‌గా ఈ ఫీచర్ టెస్ట్ చేసిన తర్వాత ఇతర యూజర్లందరికీ ఈ ఫీచర్ రిలీజ్ అవుతుంది. స్నేహితులు, బంధువులు, ఉద్యోగులు నిత్యం టచ్‌లో ఉండేందుకు వాట్సప్ గ్రూప్స్ ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరి వల్ల గ్రూప్స్‌లో చికాకులు తప్పవు. అలాంటివారికి గ్రూప్ అడ్మిన్లు చెక్ పెట్టేందుకు ఈ ఫీచర్ తప్పకుండా ఉపయోగపడుతుంది.

    ఇక Delete Message for Everyone ఫీచర్ టైమ్ లిమిట్ పెంచడానికి కూడా వాట్సప్ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఒక గంట, ఎనిమిది నిమిషాలు, 16 సెకండ్ల టైమ్ లిమిట్ ఉంది. త్వరలో ఏడు రోజుల వరకు టైమ్ లిమిట్ పెరగనుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు